ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ‘ఏసర్ ఐకోనియా A501’..!!

Posted By: Super

ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ‘ఏసర్  ఐకోనియా A501’..!!

ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.2 ఆధునిక ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఆధునిక వర్షన్ లో రూపుదిద్దుకున్న ‘ఏసర్ ఐకోనియా A501’ త్వరలో మార్కెట్లోకి రానుంది. 10.1 అంగుళాల ఎల్ సిడీ టచ్ స్క్రీన్ డిస్ ప్లే సామర్ధ్యం కలిగిన ఈ టాబ్లెట్ 3జీ, 2జీ వ్యవస్థలకు సహకరిస్తుంది. కేవలం 730 గ్రాముల బరువు కలిగిన ఈ టాబ్లెట్ పీసీలో టెగ్రా 2 డ్యూయల్ కోర్ కోర్టెక్స్ ప్రొసెసింగ్ వ్యవస్థ అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది. పొందుపరిచిన DDR2 1జీబీ ర్యామ్ వ్యవస్థ మరింత లబ్థి చేకూరుస్తుంది.

ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఏర్పాటు చేసిన హెచ్ టీఎమ్ఎల్ బ్రౌజర్, గేమింగ్, సోషల్ నెట్ వర్కింగ్ వంటి ఆప్లికేషన్లు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. టాబ్లెట్ పీసీలో అనుసంధానించిన గుగూల్ టాక్, జీ - మెయిల్, యూ ట్యూబ్, పికాసో సాఫ్ట్ వేర్లు వినియోగదారునికి మరింత ఉపకరిస్తాయి. కెమెరా అంశాలను పరిశీలిస్తే పొందుపరిచిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరాలు నాణ్యమన వీడియో ఛాటింగ్ తో పాటు ఫోటోలను అందిస్తాయి.

శక్తివంతమైన లీపీయాన్ 3250 mAh బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో ప్లేయర్లు
ఎంపీత్రీ, వావ్, గ్జివిడ్ వంటి ఫార్మాట్లకు సహకరిస్తాయి. ఎక్సటర్నల్ మైక్రో ఎస్ డీ స్లాట్ ద్వారా జీబీని 32కు వృద్థి చేసుకోవచ్చు. 802.11 b/g/n సామర్ధ్యం గల వై - ఫై, A2DP వర్షన్ బ్లూటూత్, 2.0 యూఎస్బీ పోర్టు వంటి అంశాలు డేటాను మరింత వేగవంతంగా ట్రాన్స్ ఫర్ చేస్తాయి. రూ.30000కే ఈ సొగసరి టాబ్లెట్ పీసీని సొంతం చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot