హిట్ కొట్టేందుకు మార్చిలో..!

Posted By: Super

హిట్ కొట్టేందుకు మార్చిలో..!

 

టెక్ మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని అధిరోహించిన తైవాన్ కెంపనీ ఏసర్, కంప్యూటింగ్ ఇతర మొబైల్ పరికరాలను పలు దేశాలకు ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతి పెద్ద కంపెనీగా ఏసర్‌కు గుర్తింపు లభించింది. మారుతున్న పరిణామాల నేపధ్యంలో కంపెనీ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ పై ద్ళష్టిసారించింది. ఈ క్రమంలో ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ ఏ510’ నమూనాలో అత్యాధునిక టాబ్లెట్ కంప్యూటర్‌ను వ్ళద్ధి చేసింది. మార్చి ప్రారంభంనాటికి డివైజ్‌ను ఫ్రాన్స్, యూరప్ ప్రాంతాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

టాబ్లెట్ ప్రత్యేకతలను పరిశీలిస్తే:

* 10.1 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

* 5 మెగా పిక్సల్ హై డెఫినిషన్ ఫ్రంట్ కెమెరా,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 3జీ కనెక్టువిటీ,

* సిమ్ కార్డ్ స్లాట్,

* 18 గంటల బ్యాకప్ నిచ్చే పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థ,

* ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* శక్తివంతమైన క్వాడ్ కోర్ న్విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

* వై-ఫై 802.11n,

* బ్లూటూత్ 2.1 + EDR,

* హెచ్ డిఎమ్ఐ అవుట్,

* మైక్రో యూఎస్బీ పోర్టు,

* కాంబో ఆడియో జాక్.

ఫ్రెంచ్ మార్కెట్లో ఏసర్ ఐకోనియా ట్యాబ్ ఏ510 ధర రూ.30,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot