ఆ వివరాలు బయటకు.. డిసైడ్ చేయ్యాల్సింది మీరే!!

Posted By: Prashanth

ఆ వివరాలు బయటకు.. డిసైడ్ చేయ్యాల్సింది మీరే!!

 

కంప్యూటింగ్ పరికరాల తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న ఏసర్ ఇటీవల కాలంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఐకోనియా ఏ700’ టాబ్లెట్ పీసీ వివరాలు తాజాగా నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌లో శక్తివంతమైన ఫీచర్లను లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:

10 అంగుళాల హై డెఫినిషన్ మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్) , డివైజ్ మందం కేవలం 9.9mm, 5.1 డాల్బీ డిజిటల్ ఆడియోను సపోర్ట్ చేసే ఆడియో ప్లేయర్, క్వాలిటీ వీడియో ప్లేయర్, 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ఎన్-విడియా క్వాడ్ కోర్ టెగ్రా3 ప్రాసెసింగ్ వ్యవస్థ సామర్ధ్యం (1300 MHz), ఉత్తమ పనితీరు కనబరిచే గ్రాఫిక్ ప్రాసెసర్ 1జీబి డిడిఆర్ 2 ర్యామ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా జీబిని 32కు పెంచుకునే వెసలబాటు, వై-పై, బ్లూటూత్ (v3.0), జీపీఎస్ సపోర్ట్, హెచ్‌డిఎమ్ఐ అవుట్‌పుట్, లౌడ్ స్పీకర్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించేందుకు పలు అప్లికేషన్‌లను ముందుగానే లోడ్ చేశారు. టైటానియమ్ గ్రే మరియు మెటాలిక్ రెడ్ కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ 700’ టాబ్లెట్ కంప్యూటర్ భారతీయ మార్కెట్లోకి త్వరలో రానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot