అదును కోసం ఎదరు చూస్తున్న‘ఏసర్’..?

Posted By: Prashanth

అదును కోసం ఎదరు చూస్తున్న‘ఏసర్’..?

 

మంచి తురుణం కోసం ఎదురు చూస్తున్న ‘ఏసర్’ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసేందుకు ఉవ్విలూరుతుంది. ‘ఏసర్ ఐకోనియా A700’గా విడుదల కాబోతున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఇతర టాబ్లెట్ ఉత్పత్తి సంస్థలకు గట్టి పోటినిస్తుందని ఏసర్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ డివైజ్ బరువు కేవలం 650 గ్రాములు, ప్రయాణ సందర్భాల్లో సలువుగా క్యారీ చేయవచ్చు. వేగవంతమైన ప్రాసెసింగ్, అత్యుత్తమ పనితీరు, గ్లూసీ బ్లాక్ డిజైన్, పవర్‌ఫుల్ కెమెరా వంటి అంశాలు గ్యాడ్జెట్‌కు ప్రొఫెషనల్ హోదాను రంగరించాయి. హై డెఫినిషన్ వ్యవస్థను సపోర్ట్ చేసే ఈ స్లిమ్ కంప్యూటింగ్ పరికరం రియాల్టీ అనుభూతులను అనుక్షణం మీకు చేరువుచేస్తుంది.

‘ఏసర్ ఐకోనియా A700’ ముఖ్యాంశాలు:

* సమర్ధవంతమైన పనితీరునందిచే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై టాబ్లెట్ రన్ అవుతుంది, * పటిష్ట క్వాడ్ కోర్ న్విడియా టెగ్రా 3 మొబైల్ ప్రాసెసర్, * ప్రాసెసర్ క్లాక్ వేగం 1.3 GHz, * డిస్‌ప్లే 10.1 అంగుళాలు (టచ్ స్ర్కీన్), * 1080 పిక్సల్ రిసల్యూషన్‌తో హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * 3జీ కనెక్టువిటీ సపోర్ట్, * వై-ఫై, * బ్లూటూత్, * 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, * ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ కోసం సెకండరీ కెమెరా, * హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకునేందుకు హెచ్డీఎమ్ఐ పోర్ట్, * 9800 mAh బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot