మీ టేస్ట్‌కు తగ్గట్లగా..!!, ‘ఏసర్’.. ‘మోటరోలా’..!!

Posted By: Super

మీ టేస్ట్‌కు తగ్గట్లగా..!!, ‘ఏసర్’.. ‘మోటరోలా’..!!

నలుపు రంగు విర్ట్యుల్ క్వర్టీ టచ్ స్క్రీన్‌తో రూపుదిద్దకున్న రెండు టాబ్లెట్ పీసీలు ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నాయి. వీటిలో ఒక బ్రాండ్ ‘ఏసర్ ఐకోనాయా’ కాగా మరో బ్రాండ్ ‘మోటరోలా’. ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ A 100’ పేరుతో విడుదల కాబోతున్న ‘ఏసర్’ టాబ్లెట్, ‘మోటరోలా జూమ్’ పేరుతో విడుదల కాబోతున్న ‘మోటరోలా’ టాబ్లెట్లు అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్నాయి.

వీటిలోని ఫీచర్లను పరిశీలిస్తే.. ‘ఏసర్ ఐకోనియా’ 7 అంగుళాల టచ్ స్ర్కీన్ సామర్ధ్యంతో పాటు మల్టీ టచ్ సౌలభ్యత కలిగి ఉంది. ఇక వైడ్ స్ర్కీన్ కలిగి ఉన్న మోటరోలా జూమ్ అల్టిమేట్ వీడియో ఎక్స్పీరియన్స్ తో పాటు గేమింగ్ అనుభూతిని వినియోగదారులకు కలిగిస్తుంది.

10.1 అంగుళాల డిస్ ప్లేతో 1280 x 800 పిక్సల్ సామర్థ్యం కలిగిన ‘మోటరోలా జూమ్’ సీడీఎమ్ఏ వ్యవస్థకు సహకరిస్తుంది. ఏసర్ ఐకోనియా నెట్‌వర్క్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ‘ఏసర్’ టాబ్లెట్ 2జీ నెట్‌వర్క్‌ను సపోర్టు చేయేచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

కెమెరా అంశాలను పరిశీలిస్తే, ఈ రెండు టాబ్లెట్లు అత్యంత సామర్థ్యం కలిగిన ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను కలిగి ఉంటాయి. వీటి పిక్సల్ సామర్థ్యాన్ని పరిశీలిస్తే, బ్యాక్ కెమెరా 5 మెగా పిక్సల్, ఫ్రంట్ కమెరా 2 మెగా పిక్సల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 2 మోగా పిక్సల్ సామర్థ్యం కలిగిన ఫ్రెంట్ కెమెరా అద్భుతమైన ప్రత్యక్ష ఛాటింగ్ అనుభూతిని మీకు కలిగిస్తుంది.

ఆండ్రాయిడ్, హనీకూంబ్ v3.0 ఆపరేటింగ్ వ్యవస్థల ఆధారితంగా పని చేసే ఈ టాబ్లెట్లు సమర్థవంతమైన పనితీరును వినియోగదారుడుకి అందిస్తాయి. త్రీడీ ఏనిమేటడ్ ఆటలతో పాటు, సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలో, 3డీ గేమింగ్ ఆప్షన్‌ను ఈ రెండు టాబ్లెట్లలో పొందుపరిచారు. వీడియో రికార్డింగ్, జీపీఎస్ ఫెసిలిటీ, వై - ఫై, సోషల్ నెట్‌వర్కింగ్ వంటి అంశాలు వినియోగదారునికి మరింత లాభదాయకంగా నిలుస్తాయి.

అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ టాబ్లెట్ పీసీలను, వినియోగదారుల అభిరుచులను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. అయితే ధరలలో మాత్రం భారీ వృత్యాసం ఉంది. వైడర్ స్ర్కీన్ కలిగిన మోటరోలా జూమ్ రూ.31,500 ఉండగా, ఏసర్ ఐకోనియా ధర రూ.17,000 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot