గ్యాప్ లేకుండా దూసుకొస్తుంది!

Posted By: Staff

గ్యాప్ లేకుండా దూసుకొస్తుంది!

 

ప్రముఖ బ్రాండ్ ఏసర్ ఎడతెరపి లేకుండా టాబ్లెట్ కంప్యూటర్లను విడుదల చేస్తోంది. తాజాగా ఈ సంస్థ డిజైన్  చేసిన టాబ్లెట్ ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ ఏ211’ విడుదలకు ముస్తాబవుతుంది. శక్తివంతమైన టెగ్రా3 ప్రాసెసర్‌ను ఈ గ్యాడ్జెట్‌‌లో నిక్షిప్తం చెయ్యటంతో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఈ టాబ్లట్  స్ర్కీన్ పరిమాణం 10.10 అంగుళాలు ఉంటుంది. పొందుపరిచిన 1280 x 800పిక్సల్ రిసల్యూషన్ క్లారిటీతో కూడిన విజువల్ అనుభూతికి లోను చేస్తుంది. మల్టీ టచ్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది.

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆఫరేటింగ్ సిస్టంను పీసీలో లోడ్ చేశారు. పొందుపరిచిన క్వాడ్ కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, 1200మెగాహెట్జ్ క్లాక్ వేగాన్నికలిగి ఉపయుక్తమైన పనితీరును కనబరుస్తుంది.  నిక్సిప్తం చేసిన 1000ఎంబీ ర్యామ్ సిస్టం వేగాన్ని రెట్టింపు చేస్తుంది. 3జీ నెట్‌వర్క్‌ను టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. వై-ఫై కనెక్టువిటీ సౌలభ్యతతో  అంతరాయంలోని నెట్ బ్రౌజింగ్‌ను నిర్వహించుకోవచ్చు. బ్లూటూత్ ఇంకా యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలను డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. హెచ్‌డిఎమ్‌ఐ పోర్టు ఏర్పాటుతో టాబ్లెట్‌ను

హై డెఫినిషన్ డివైజ్‌లకు జత చేసుకోవచ్చు.

ఏర్పాటు చేసిన ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వ్యవస్థలు డివైజ్ మల్టీమీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. పీసీ ముందు భాగంలో ఏర్పాటు చేసిన వెబ్‌క్యామ్ క్వాలిటతో కూడిన వీడియో చాటింగ్‌ను అందిస్తుంది. ఏర్పాటు చేసిన 3260ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్‌ను అందిస్తుంది. డివైజ్ పూర్తి బరువు 712 గ్రాములు, ఆకర్షణీయమైన డిజైనింగ్, ఐకోనియా ట్యాబ్ ఏ211 ధర ఇతర విడుదల అంశాలకు  సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more about:
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting