‘జూలై’ కోసం అభిమానులు వెయిటింగ్!

Posted By: Prashanth

‘జూలై’ కోసం అభిమానులు వెయిటింగ్!

 

కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల నిర్మాణ సంస్థ ఏసర్ ఉత్తమ శ్రేణి ఫీచర్లతో కూడిన టాబ్లెట్ పీసీని జూలై నాటికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏసర్ ఐకోనియా టాబ్ ఏ701 మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 4.0.1 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది. డివైజ్‌లో శక్తివంతమైన ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్‌ను వినియోగించారు. 1జీబి ర్యామ్ ప్రాసెసింగ్ వేగాన్ని పటిష్టం చేస్తుంది. ఎన్-విడియో గ్రాఫిక్ కంట్రోలర్ వ్యవస్థ పీసీ గ్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

స్ర్కీన్ పరిమాణం 10.1 అంగుళాలు. మల్టీ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరాతో వీడియోలను హైడెఫినిషన్ క్వాలిటీలో రికార్డ్ చేసుకోవచ్చు. ముందు భాగంలో ఏర్పాటు చేసిన 0.3 మెగా పిక్సల్ కెమెరాతో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. టాబ్లెట్ జీఎస్ఎమ్ 900/1800 సెల్యులర్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ వంటి హైస్పీడ్ కనెక్టువిటీ ఆప్షన్‌లు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్ఐ అవుట్‌తో పీసీని హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకోవచ్చు.

పొందుపరిచిన లితియమ్ ఐయోన్ బ్యాటరీ 12 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ముందుగానే లోడ్ చేసిన ఆడియో, వీడియో ప్లేయర్లు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి. టాబ్లెట్ ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జూలైలో అధికారికంగా విడుదల చేస్తారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot