వాటి మధ్య ‘అగ్గి’ రాజుకుంటుంది..!!

By Super
|
iPad 2
ప్రస్తుత టాబ్లెట్ మార్కెట్లో అగ్గి రాజుకుంటుంది.. ప్రపంచ దిగ్గజ బ్రాండ్లు ఆధునిక సాంకేతికతను ఆయుధాలుగా ప్రదర్శిస్తూ నువ్వా.. నేనా అని పోటి పడుతున్నాయి. ‘స్మార్ట్ ఫోన్ల’ అమ్మకాల స్థాయికి ‘టాబ్లెట్’ మార్కెట్ ఎదిగిందంటే ప్రపచం వ్యావ్తంగా వీటి ఉధృతి ఏ మేరకు పాకిందో అర్ధమవుతుంది. ఏ కంపెనీ ఎన్నెన్ని మోడళ్ల ప్రవేశపెట్టినా అవి హిట్టా, ఫ్లాపా అని తెల్చేల్సింది చివరిగా వినియోగదారులు మాత్రమే...

సాంకేతిక ప్రపంచంలో రారాజుగా నిలిచిన ‘ఆపిల్’ను ఢీకునేందుకు ‘ఏసర్’ బరిలోకి దూకింది. ఐప్యాడ్ - 2ను ఎదుర్కొనేందుకు, ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ 500’ పేరుతో టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది. జనాధారణ అధికంగా ఉన్న ‘ఆపిల్ ఐప్యాడ్ -2’ పై ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఐప్యాడ్ -2కు ధీటుగా నిలబడే క్రమంలో ‘ఏసర్’ ఆకర్షణీయమైన ఫీచర్లను ‘ట్యాబ్ 500’లో పొందుపరిచింది.

ఎల్‌ఈఢి సామర్ధ్యం గల టీఎఫ్టీ టచ్ స్క్రీన్, 768 X 1024 పిక్సల్ రిసల్యూషన్‌తో ఐప్యాడ్ ఇప్పటికే పలువురు మనసులను దోచుకుంది. 10.1 అంగుళాల స్క్రీన్‌తో వస్తున్న ‘ఏసర్’ 800 X 1280 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఐప్యాడ్ - 2కి ఎదురొగ్గి నిలబడింది. పొందుపరిచిన మల్టీటచ్ ఇన్‌పుట్, గైరో సెన్సార్ వంటి వ్యవస్థలు ‘ట్యాబ్ 500’కి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ‘ఐప్యాడ్ -2’లో పొందుపరిచిన ఫింగర్ ప్రింట్ వ్యవస్థ, ధృడత్వం కలిగిన ఓలియో ఫోబిక్ సరఫేస్, గైరో సెన్సార్, యాక్సి‌స్ సెన్సార్ వంటి ప్రత్యేకతలు వినియోగదారునికి లబ్థి చేకూరుస్తాయి. ఇక మెమరీ విషయానికి వస్తే ‘ఐప్యాడ్ -2’ 16,32,64 జీబీల సామర్ధ్యం కలిగి ఉండగా. ‘ఏసర్’ 32జీబీ సామర్ధ్యం కలిగి ఉంది.

‘ట్యాబ్ 500’లో పొందుపరిచిన 5 మెగా పిక్సల్ కెమెరా ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 2592 X 1944ను సపోర్టు చేస్తుంది. ‘ఐప్యాడ్ - 2’లో కెమెరా సౌలభ్యతను పరిశీలిస్తే 0.7 మెగా పిక్సల్ కెమెరా 960 X 720 కలిగి ఉంటుంది. ప్రొసెసర్ విషయానికి వస్తే ఈ రెండు గ్యాడ్జెట్లలోనూ ఒకటే సామర్థ్యం గల 1GHz డ్యూయల్ కోర్ ఆర్మ్ కోర్టెక్స్ A9 వ్యవస్థను పొందుపరిచారు. ఇక చిప్ సెట్ల విషయానికి వస్తే ‘ఆపిల్’లో A5 చిప్ సెట్, ‘ఏసర్’లో టెగ్రా 2 T20 చిప్ సెట్లు దర్శనమిస్తాయి. డిజిటల్ కంపాస్, ఎంపి3, ఎంపీ4 వంటి అంశాలు రెండు డివైజుల్లోనూ ఒకే విధంగా ఉంటాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X