కళ్లు చెదరగొడుతున్న ‘ఏసర్’ మోడళ్లు...!!

Posted By: Staff

కళ్లు చెదరగొడుతున్న ‘ఏసర్’ మోడళ్లు...!!

ప్రస్తుతం కంప్యూటింగ్ మార్కెట్ అంతా టాబ్లెట్ పీసీల పైనే నడుస్తుంది... ఒకటా.. రెండో.. వందల సంఖ్యలో కంపెనీలు వీటిని మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ టాబ్లెట్ల గోలలో పడిన పలు కంపెనీలు లాప్ టాప్‌ల అమ్మకాల పై శ్రద్ధతగ్గించిందన్న విషయం వాస్తవమే... దింతో ల్యాప్ టాప్ల మార్కెట్‌కు కాస్త జోరు తగ్గిందనే చెప్పొచ్చు.. జేబులో పెట్టుకు తిరిగే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి రాగా .. బరువుతోకూడిన పెద్ద ల్యాప్ టాప్ లు ఎందుకుని పలువురు వినియోగదారులు వారిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం దేనికుండే సౌలభ్యత దానికుంటుందంటూ ల్యాప్ టాప్ ల వాడకాన్ని సమర్థిస్తున్నారు.

‘ఏసర్’.. ఈ సంస్థ కంప్యూటర్ల తయరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ క్యూట్ బ్రాండ్ అనతి కాలంలోనే వినియోగదారులు విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్యనే ‘ఏసర్’ టాబ్లెట్ పీసీల మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పనిలో పనిగా ఏసర్ సంస్థ, Acer Aspire 5755, Acer Aspire 4755 మోడళ్లతో రెండు ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఆధునాతన వ్యవస్థతో పాటు ఆకట్టకునే శైలిలో రూపొందింపబడిన ఈ ల్యాప్‌టాప్‌లు 5 రకాల కలర్ పుల్ ఫినిషింగ్‌లతో వినియోగదారుల నుంచి ‘good looking experience’ని రాబట్టకుంటున్నాయి. అయితే వివిధ configurationsతో ఈ రెండు మోడళ్లు లభ్యమవతున్నాయి.

ఈ రెండు మోడళ్లలలో తేడాలను గమనిస్తే Acer Aspire 5755 15 అంగుళాల స్ర్కీన్ కలిగిఉంటే, Acer Aspire 4755 14 అంగుళాల స్ర్కీన్ సౌలభ్యం కలిగి ఉంది. ఆధునిక వ్యవస్థైన Core i5 Processorsతో రూపుదిద్దకున్న ఈ ల్యాప్‌టాప్‌లు వేగవంతంగా పనిచేస్తాయి. వీటికి తోడు అనుసుంధానించబడని NVIDIA GeForce GT 500 Graphics Processing Unit, గేమింగ్ ,గ్రాఫిక్స్ వంటి అంశాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుంది.

ఇక Storage విషయానికి వస్తే ఈ ల్యాప్ టాప్ లలో 750 GBగల హార్డ్ డిస్క్‌ను పొందుపరిచారు. ఎంటర్ టైన్ మెంట్‌తో పాటు వివిధ పనులకు సంబంధించిన ఫైల్స్‌ను ఇందులో పదిల పరుచుకోవచ్చు. ఈ రెండు మోడళ్లకు అనుసంధానించబడిన 1.3 మోగా పిక్సల్ వెబ్ కామ్ నాణ్యమైన వీడియో చిత్రాలను అందిస్తుంది. అంతేకాదు.. ఈ వెబ్ క్యామ్ ద్వారా మీ మిత్రులు లేతా కుటుంబ సభ్యులతో వీడియో ఛాటింగ్ జరుపుకోవచ్చు. Bluetooth, Wi-Fi , USB out ports వంటి ఫీచర్లును ఆధునికంగా తీర్చిదిద్దారు.

వినసొంపైన మ్యూజిక్‌ను వినేందుకు ల్యాప్‌టాప్‌తో పాటు రెండు Dolby Digital sound స్పీకర్లను అదనంగా పొందవచ్చు. ఏసర్ మాల్స్ లేదా అందుబాటులో ఉన్న ప్రముఖ కంప్యూటర్ విక్రయి కేంద్రాల్లో Acer Aspire 5755, Acer Aspire 4755 మెడళ్ల ల్యాప్‌టాప్‌లు లభ్యమవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting