కంచుకోట పై పాగా..?

Posted By: Super

కంచుకోట పై పాగా..?

 

ల్యాప్‌టాప్‌ల వ్యాపారానికి కంచుకోటగా గుర్తింపు తెచ్చుకున్న భారత్‌లో ఏసర్ పాగా వేసింది. ఈ బ్రాండ్‌కు అచ్చొచ్చిన సిరీస్‌లైన ఎస్, ఎమ్, వీ3, వీ5ల నుంచి సుమారు 30 నోట్‌బుక్‌లను లాంచ్ చేసింది. సుపీరియర్ డిజైనింగ్, ఉత్తమ పనితీరు, హై పోర్టబులిటీ వంటి ఉన్నత అంశాలతో రూపొందించబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు అన్నివిధాలైన వినియోగదారుల అవసరాలను సమర్థవంతంగా నెరవేర్చగలవని అసస్ వర్గాలు ధీమావ్యక్తం చేస్తున్నాయి.

పైన పేర్కొన్న పలు సిరీస్‌లకు సంబంధించి నోట్‌బుక్‌లు వాటి ఫీచర్లు:

ఎమ్ సిరీస్:

ఈ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన ‘ఆస్పైర్ టైమ్‌లైన్ అల్ట్రా ఎమ్3’ స్లిమ్ ఇంకా తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఎన్-విడియా జీఫోర్స్ జీటీ640ఎమ్ గ్రాఫిక్ కార్డును ల్యాపీకి అనుసంధానించటంతో గ్రాఫిక్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. పొందుపరిచిన సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. లోడ్ చేసిన మరో టెక్నాలజీ ఏసర్ ఇన్స్ స్టెంట్  ఎల్లప్పుడు వివిధ టెక్నాలజీలతో కనెక్ట్ చేస్తుంది. ఏర్పాటు చేసిన లి-పాలిమర్ బ్యాటరీ 8 గంటల బ్యాకప్‌తో పాటు 80 రోజుల స్లీప్‌మోడ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ల్యాపీ 15 అంగుళాల స్ర్కీన్ వేరింయట్ ధర రూ.51,999.

‘ఈ ’సిరీస్:

ఆస్పైర్ ‘ఈ’ సిరీస్ నుంచి విడుదలైన ల్యాప్‌టాప్‌లు మొబైల్ పీసీ అనుభూతిని యూజర్‌కు చేరువచేస్తాయి. ఉపయుక్తమైన మల్లీ మీడియా అదేవిధంగా కనెక్టువిటీ ఫీచర్లు యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను అందిస్తాయి. ఈ సిరీస్ నుంచి విడుదలయ్యే ల్యాపీల ప్రారంభ ధర

రూ. 24,749.

వీ3 సిరీస్:

ఆస్పైర్ వీ3 సిరీస్ నుంచి డిజైన్ కాబడిన ల్యాప్‌టాప్‌లు వినోదపు అవసరాలను సమృద్థిగా తీరుస్తాయి. సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ఎన్-విడియా జీఫోర్స్ గ్రాఫిక్‌చిప్ వంటి శక్తివంతమైన అంశాలను నోట్‌బుక్‌లో పొందుపరిచారు. ప్రారంభ ధర రూ. 37,999.

వీ5 సీరిస్:

ఈ సిరీస్ నుంచి విడుదలయ్యే నోట్‌బుక్‌లు ఇతర వాటితో పోలిస్తే 30శాతం స్లిమ్, 10 శాతం తక్కువ బరువును కలిగి ఉంటాయి. ఇంటెల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్‌తో పాటు పటిష్టమైన ఎన్-విడియా జీఫోర్స్ గ్రాఫిక్ వ్యవస్థలను ఈ డివైజ్‌లు కలిగి ఉన్నాయి. పొందుపరిచిన ఏసర్ బ్యాకప్ మేనేజర్ డేటాను భద్రపరుస్తుంది. ప్రారంభ ధర రూ.27,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot