‘ఏసర్’ కొత్త వర్షన్..?

Posted By: Super

‘ఏసర్’ కొత్త వర్షన్..?
పర్సనల్ కంప్యూటర్ల విక్రయాల్లో  ‘ఏసర్ విరిటన్’ (Acer Veriton) అత్యధిక మంది వినియోగదారులను మెప్పించగలిగింది. ఈ ‘సిరీస్’లో విడుదలైన  పీసీలు అటు ప్రొఫెషనల్స్, ఇటు హోమ్ యూజర్ల అవసరాలు తీర్చటంలో సఫలీకృతమయ్యాయి. వివిధ కాన్ఫిగరేషన్లు, స్పెసిఫికేషన్లు, డైమెన్షన్లతో రూపుదిద్దుకున్న ఈ పీసీలకు అన్ని వర్గాల సాంకేతిక  ప్రేమికులు ఫ్లాటయ్యారు.

తాజాగా ఈ వర్షన్లో విడుదలైన మరో పీసీ ‘ఏసర్ Z620G’, ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించి  సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, స్పీకర్స్, డిస్క్ డ్రైవ్స్, మానిటర్ తదితర అంశాలు ఈ ఒకే యూనిట్‌లో నిక్షిప్తం కాబడి ఉంటాయి.  ‘బిజినెస్’ వాతవరణానికి సరితూగే విధంగా చక్కటి విధానాలతో ఈ పరికరాన్ని రూపొందించారు.

బ్లాక్, సిల్వర్ కలర్ కాంబినేషన్‌లో Z620G అందుబాటులో ఉంది. 20 అంగుళాల LED స్క్రీన్, విండోస్ 7 ప్రాఫెషనల్ ఆపరేటింగ్ సిస్టమ్,

2.5GHz ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 4జీబీ, 8జీబీ ఆప్షనల్ ర్యామ్. 500 జీబీ హార్డ్ డిస్క్, న్విడియా జీ ఫోర్స్  GT520M గ్రాఫిక్ కార్డ్,  శక్తివంతమైన మల్లీమీడియా అప్లికేషన్ తదితర మన్నికైన పటిష్ట ఫీచర్లను పీసీలో పొందుపరిచారు.

‘డాల్బీ సౌండ్’ను విడుదల చేసే స్పీకర్లను డివైజులో ఏర్పాటు చేశారు. వీడియో ఛాటింగ్ జరుపుకునే విధంగా ‘వెబ్ క్యామ్’ తదితర సౌకర్యవంతమైన అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఏర్పాటు చేసిన 6 యూఎస్బీ పోర్టులు కనెక్టువిటీ అంశాలను మరింత పటిష్టితం చేస్తాయి. ‘ఏసర్ ప్రో షీల్డ్ డేటా గార్డింగ్ టెక్నాలజీ’ (Acer pro shield data guarding technology) సెక్యూరిటీ అంశాలను మరింత పటిష్టితం చేస్తుంది. పీసీలో ఏర్పాటు చేసిన ‘ఒన్ టచ్ రికవరీ బటన్’ ఒరిజినల్ ఫ్యాక్టరీ  సెట్టింగులను కాపాడుతుంది. అత్యాధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘ఏసర్ Z620G’ ఇండియన్ మార్కెట్ ధర రూ.40, 000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot