దూకుడు పెంచిన పవర్ బ్రాండ్..?

By Prashanth
|
Acer


అంతర్జాతీయ బ్రాండ్ ఏసర్, తన టైమ్‌లైన్ సిరీస్ నుంచి ఎమ్5 పేరుతో అల్ట్రాబుక్‌ను డిజైన్ చేసింది. రెండు డిస్‌ప్లే వేరింయట్‌లలో ఈ ల్యాపీ లభ్యంకానుంది. వేగవంతమైన పనిసామర్ధ్యం కలిగిన ఐవీ‌బ్రిడ్జ్ ప్రాసెసర్‌ను ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లో లోడ్ చేశారు.

ఫీచర్లు:

డిస్‌ప్లే సైజ్ రెండు వేరింయంట్‌లలో ( 14, 15 అంగుళాలు),

రిసల్యూషన్ 1366×768పిక్సల్స్,

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

ఇంటెల్ ఐవీ‌బ్రిడ్జ్ ప్రాసెసర్,

ఎన్-విడియా జీఫోర్స్ జీటీ640ఎమ్, 1జీబి డీడీఆర్5 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఇంటెల్ చిప్‌సెట్,

వెబ్‌క్యామ్,

1జీబి ర్యామ్,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

ఇన్‌బుల్ట్ స్పీకర్స్,

స్టాండర్డ్ బ్యాటరీ (బ్యాకప్ 8 గంటలు).

ఎమ్5లో లోడ్ చేసిన స్పెసిఫికేషన్‌లు ఉత్తమమైన కంప్యూటింగ్ విలువలను కలిగి ఉన్నాయి. ఈ డివైజ్ జూన్15నాటికి యూకె మార్కెట్లో విడుదలవతుంది. ఇండియన్ మార్కెట్లో ధర ఇతర వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏసర్ టైమ్‌లైన్ ఎమ్3:

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ బ్రాండ్ ఏసర్ ఇటీవల లాంఛ్ చేసిన అత్యంత పల్చటి అల్ట్రాబుక్ M3-581TG ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యమవుతుంది. ఆస్పైర్ టైమ్‌లైన్ సిరీస్ నుంచి వచ్చిన ఈ డివైజ్ ఉత్తమ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. ధర 70,000.

ప్రధాన ఫీచర్లు:

15.6 అంగుళాల LCD హై డెఫినిషన్ స్ర్కీన్, ఎన్-విడియా జీఫోర్స్ GT 640M గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, ఫుల్ సైజ్ చిక్‌లెట్ కీబోర్డ్, ఇంటెల్ శాండీ బ్రిడ్జ్ ప్రాసెసర్, డీవీడీ సూపర్ మల్టీ డీఎల్ ఆప్టికల్ డ్రైవ్, 500జీబి సాటా హార్డ్ డ్రైవ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, హై స్పీడ్ హెచ్‌డిఎమ్ఐ పోర్టు, డాల్టీ హోమ్ ధియోటర్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 5 ఇన్ 1 కార్డ్ రీడర్, క్రిస్టల్ ఐ హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు. ప్రత్యేకించి గేమింగ్ ప్రేమికుల కోసం ‘బ్యాటిల్ 3’ గేమ్‌ను లోడ్ చేశారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X