Home
Computer

ఏసర్‌ నుంచి ల్యాప్‌టాప్‌ విడుదల.. విండోస్‌ 11, 16 అంగుళాల డిస్‌ప్లే, కో పైలెట్‌ బటన్‌ సహా అనేక ప్రత్యేకతలు..!

ఏసర్‌ నైట్రో లైట్ 16 ల్యాప్‌టాప్‌ భారత్ మార్కెట్‌ లో లాంచ్‌ అయింది. ఈ ల్యాప్‌టాప్‌ 16 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు విండోస్‌ 11 పైన పనిచేస్తుంది. ఈ ఏసర్‌ ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ కోర్‌ i7 13 జెన్ పైన పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 100W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. మరియు అనేక పోర్టులను కలిగి ఉంటుంది. బెస్ట్‌ ఆడియో సపోర్టు కోసం రెండు స్పీకర్‌లను అమర్చి ఉంటుంది. ఈ ఏసర్‌ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల పూర్తి వివరాలు.

ఏసర్ నైట్రో లైట్ 16 ల్యాప్‌టాప్‌ పూర్తి వివరాలు :
ఈ ల్యాప్‌టాప్ (Acer Nitro Lite 16 Laptop) 16 అంగుళాల WUXGA (1920 x 1200 పిక్సల్‌) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 165Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ రెండు స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

acer nitro lite 16 laptop launched in india telugu news

ప్రాసెసర్‌, OS వివరాలు :
ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ కోర్‌ i7-13620H ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు 6GB GDD6 VRAM తో కూడిన RTX 4050 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 16GB DDR5 ర్యామ్‌, 512GB SSD ను సపోర్టు చేస్తుంది. విండోస్‌ 11 OS పైన పనిచేస్తుంది.

ఏసర్‌ నైట్రో లైట్‌ 16 ల్యాప్‌టాప్‌ 100W ఛార్జింగ్ సపోర్టుతో 53Wh బ్యాటరీని కలిగి ఉంది. మరియు ఫుల్‌ HD కెమెరాను అమర్చి ఉంది. బ్యాక్‌లిట్‌ కీబోర్డును కలిగి ఉంటుంది. మరియు కో పైలెట్‌ కీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ల్యాప్‌ టాప్‌ బరువు 1.95 గ్రాములుగా ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ ల్యాప్‌టాప్‌ బ్లూటూత్‌ 5.1, వైఫై 6 ను కలిగి ఉంది. దీంతోపాటు USB 3.2 పోర్టు, థండర్‌బోల్ట్‌ 4 పోర్టు, ఇథర్‌నెట్‌ పోర్టు, HDMI 2.1 పోర్టుతో పాటు ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది.

acer nitro lite 16 laptop launched in india telugu news

ఏసర్‌ నైట్రో లైట్‌ 16 ల్యాప్‌టాప్‌ ధర, సేల్ వేరియంట్ వివరాలు :
ఏసర్‌ నైట్రో లైట్‌ 16 ల్యాప్‌టాప్‌ i5-1342H CPU మరియు 16GB ర్యా్మ్ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.69,990 గా ఉంది. అదే i7-13620H ప్రారంభ ధర రూ.79,999 గా ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌ ఏసర్‌ వెబ్‌సైట్‌ లో పెర్ల్‌ వైట్‌ కలర్‌ వేరియంట్‌ లో అందుబాటులో ఉంది. ఏసర్‌ నైట్రో లైట్‌ 16 ల్యాప్‌టాప్‌ ఏసర్‌ రిటైల్‌ స్టోర్‌లు సహా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

* భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల ఏసర్‌ రెండు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. సూపర్‌ ZX, సూపర్ ZX ప్రో పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. బేస్‌ వేరియంట్‌ ధర సుమారుగా రూ.10 వేలుగా ఉంది. ఈ ఫోన్ 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
acer nitro lite 16 laptop launched in india with rs69999 starting price, key features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X