కొద్ది దూరంలో ‘ఏసర్’ తుఫాన్..?

Posted By: Super

కొద్ది దూరంలో ‘ఏసర్’ తుఫాన్..?

 

‘‘టాబ్లెట్ పీసీల పెను తుఫాన్ అతి త్వరలో అంతర్జాతీయ కంప్యూటింగ్ మార్కెట్ ను ముంచెత్తునుంది. ప్రముఖ టాబ్లెట్ పీసీ తయారీదారు ‘ఏసర్’ ఆడ్వాన్సడ్ అత్యాధునిక క్వాడ్ కోర్ టాబ్లెట్ కంప్యూటర్ పరికరాలను మార్కెట్లో విడుదల చేయునుంది. ఏసర్ ఐకోనియా ‘క్వాడ్ కోర్ 510’, ‘క్వాడ్ కోర్ 511’ వర్షన్లలో ఈ గ్యాడ్జెట్లు లభ్యంకానున్నాయి.’’

క్లుప్తంగా వీటి ఫీచర్లను పరిశీలిస్తే:

- ఆండ్రాయిడ్ v4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ వ్యవస్థను ఈ రెండు వేరియంట్లలో లోడ్ చేశారు.

- ఏర్పాటు చేసిన న్విడియా టెగ్రా 3 SoC ప్రాసెసర్లు పటిష్టమైన పనితీరును కలిగి ఉంటాయి.

- ఈ పీసీల పిక్సల్ రిసల్యూషన్ 1280 x 800.

- డేటా ట్రాన్సఫరింగ్ కనెక్టువిటీ అంశాలకు సంబంధించి ‘క్వాడ్ కోర్ 510’లో ఆధునిక వై-ఫై , 3.5 mm ఆడియో జాక్, హెచ్డీఎమ్ఐ పోర్టు వ్యవస్థలను పొందుపరిచారు.

- డేటా ట్రాన్సఫరింగ్ కనెక్టువిటీ అంశాలకు సంబంధించి‘క్వాడ్ కోర్ 511’లో అత్యాధునిక వై-ఫై వ్యవస్థతో పాటు బ్లూటూత్, 3.5 mm ఆడియో జాక్, హెచ్డీఎమ్ఐ పోర్టులను ఏర్పాటు చేశారు.

- ఈ రెండు పీసీలలో మెమరీని 64జీబీ వరకు పెంచుకోవచ్చు.

- ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్‌లతో పాటు ఇతర మెసేజింగ్ ఫీచర్లను ఇరు పీసీలలో ముందుగానే అప్‌లోడ్ చేశారు.

- 2012 ప్రధమాంకంలో ఈ పీసీలను విడుదల చేసే యోచనలో ‘ఏసర్’ ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot