ఏసర్ ఎస్5.. ప్రపంచపు సన్నని అల్ట్రాబుక్!!

Posted By: Super

ఏసర్ ఎస్5.. ప్రపంచపు సన్నని అల్ట్రాబుక్!!

 

పల్చటి అల్ట్రాబుక్‌ను డిజైన్ చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మ్యాక్‌బుక్ ఎయిర్‌కు, ఏసర్ రూపంలో పోటీ ఎదురుకానుంది. కేవలం 15 మిల్లీ మీటర్ల మందంతో ‘ఎస్5’ అల్ర్టాబుక్‌ను ఏసర్ డిజైన్ చేసింది. స్టైలిష్ ఫీచర్లతో పాటు స్టన్నింగ్

స్పెసిఫికేషన్‌లను ఈ స్లిమ్ అల్ట్రాబుక్‌లో నిక్షిప్తం చేశారు.

ఏసర్ ఎస్5 ఫీచర్లు:

* ఓనిక్స్ మెగ్నిషియమ్ ఆల్లాయ్ బాడీ,

* ఇంటెల్ ఐ సిరీస్ ప్రాసెసర్,

* థండర్ బోల్డ్ కనెక్టువిటీ,

* డాల్బీ హోమ్ థియోటర్ వీడియో,

* పటిష్టమైన బ్యాటరీ,

* యూఎస్బీ 3.0 కనెక్టువిటీ,

* మన్నికైన మెమరీ బ్యాకప్,

ఈ అతి పల్చటి అల్ట్రాబుక్‌ను ‘ఏసర్’ కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో‌లో ప్రదర్శించనుంది. పూర్తి వివరాలను ఈ వేడుక ద్వారా బహిర్గతం చేస్తారు. ఏడాది రెండవ త్రైమాసికంలో ఈ స్లిమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ అన్ని ప్రముఖ స్టోర్లలో లభ్యంకానున్నట్లు సమచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot