ల్యాపీలకు సవాల్ విసురుతున్న Acer Swift 7, ధర చూస్తే బేజారే !

Written By:

టెక్నాలజీ దిగ్గజం ఏసెర్ ల్యాపీలకు సవాల్ విసురుతూ సరికొత్త ల్యాపీని వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. ఈ ల్యాపీని సీఈఎస్‌ 2018లో అట్టహాసంగా లాంచ్ చేసింది. 9.98 మి.మి మందంతో దూసుకొచ్చిన ఈ ల్యాపీని స్విఫ్ట్ 7 పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌‌తో వచ్చిన ఈ ల్యాపీని వినియోగదారులు ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది.

జియోని వదిలిపెట్టని ఎయిర్‌టెల్, కొత్త ఆఫర్లతో మళ్లీ కౌంటర్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫీచర్లు

ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌‌
అల్యూమినియం బాడీ డిజైన్‌,
గొరిల్లా గ్లాస్‌,
ఎన్‌బీటీ టచ్‌ స్క్రీన్‌ అండ్‌ టచ్‌ ప్యాడ్‌,
256 స్టోరేజ్‌ కెపాసిటీ,
8 జీబీ ర్యామ్‌ ,
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
విండోస్‌ 10,
సింగిల్‌ చార్జ్‌తో 10గంటల బ్యాటరీ లైఫ్‌

ధర

కాగా దీని ధరను కంపెనీ రూ. 1,07,470 (1699 డాలర్లు)గా నిర్ణయించింది. మార్చి ఆరంభంలో నార్త్ అమెరికాలో దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ఇతర దేశాల్లో రూ .1,29,329ధరతో అమ్మకాలు జరగనున్నాయని కంపెనీ తెలిపింది.

దూర ప్రయాణాలు చేసే వారి కోసం..

దూర ప్రయాణాలు చేసే వారి కోసం ఈ ల్యాపీని అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనిలో ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటంటే అతి తక్కువ-కాంతి పరిస్థితులలో కూడా బ్యాక్‌ లిట్‌ కీబోర్డుతో పనిచేసుకునే అవకాశం ఉంది.

స్పిన్ 3 డివైస్‌ను..

దీంతోపాటు స్పిన్ 3 డివైస్‌ను లాంచ్‌ చేయనున్నట్టు కూడా కంపెనీ ప్రకటించింది. కొత్త స్పిన్ 3 ను 8 వ జనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌, ఐసీఎస్ టెక్నాలజీ, తో 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే , రెండు ఫ్రంట్-ఫేసింగ్ స్పీకర్లు, ఏసెర్ ట్రూ హార్మోనీ టెక్నాలజీ లాంటి ఫీచర్లతో మరింత శక్తివంతంగా రూపొందిస్తోందట. టాబ్లెట్ స్పేస్-డెవలప్మెంట్ టెంట్ మోడ్‌తో అందివ్వనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Acer Swift 7 with Intel Core i7 processor launched as world's thinnest laptop More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot