టార్గెట్ యూకే..?

Posted By: Super

టార్గెట్ యూకే..?

 

అంతర్జాతీయ బ్రాండ్ ఏసర్, తన టైమ్‌లైన్ సిరీస్ నుంచి ఎమ్5 పేరుతో అల్ట్రాబుక్‌ను డిజైన్ చేసింది.  రెండు డిస్‌ప్లే వేరింయట్‌లలో ఈ ల్యాపీ లభ్యంకానుంది. వేగవంతమైన పనిసామర్ధ్యం కలిగిన ఐవీ‌బ్రిడ్జ్ ప్రాసెసర్‌ను ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లో లోడ్ చేశారు.

ఫీచర్లు:

డిస్‌ప్లే సైజ్ రెండు వేరింయంట్‌లలో ( 14, 15 అంగుళాలు), రిసల్యూషన్ 1366×768పిక్సల్స్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ ఐవీ‌బ్రిడ్జ్ ప్రాసెసర్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీ640ఎమ్, 1జీబి డీడీఆర్5 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఇంటెల్ చిప్‌సెట్, వెబ్‌క్యామ్, 1జీబి ర్యామ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, ఇన్‌బుల్ట్ స్పీకర్స్, స్టాండర్డ్ బ్యాటరీ (బ్యాకప్ 8 గంటలు). ఎమ్5లో లోడ్ చేసిన స్పెసిఫికేషన్‌లు ఉత్తమమైన కంప్యూటింగ్ విలువలను కలిగి ఉన్నాయి. ఈ డివైజ్ జూన్15నాటికి యూకె మార్కెట్లో  విడుదలవతుంది. ఇండియన్ మార్కెట్లో ధర ఇతర వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒలంపిక్స్ కోసం స్పెషల్ ఎడిషన్

లండన్‌లో నిర్వహించనున్న ఒలంపిక్స్ 2012 క్రీడా పోటీలను పురస్కరించుకుని ఏసర్ స్పెషల్ ఎడిషన్ టాబ్లెట్ కంప్యూటర్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. పేరు ‘ఏసర్ ఐకోనియా ఏ510’. వచ్చే నెలనాటికి ఈ స్పెషల్ ఎడిషన్ డివైజ్ యూకె మార్కెట్లో లభ్యం కానుంది. ఈ స్పెషల్ ఎడిషన్ గ్యాడ్జెట్ పై ఐదు ఒలంపిక వృత్తాలను డిజైన్ చేశారు. ఈ డిజైన్ యూజర్లలో ఒలంపిక్ క్రీడా స్పూర్తిని రెట్టింపు చేస్తుంది. డివైజ్‌లో లోడ్ చేసిన ట్రెయిల్ వర్షన్ యూరో స్పోర్ట్ ఛానల్ అప్లికేషన్ క్రీడాభిమానులకు మరింత లబ్ధి చేకూరుస్తంది. ఈ ఫీచర్ సౌలభ్యతతో యూజర్లు ఆటలకు సంబంధించి ప్రత్యక్ష లైవ్ కవరేజ్‌ను ఆస్వాదింవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్ టాబ్లెట్ ధర విషయానికొస్తే రూ.28,000గా అంచనా వేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot