ఇక క్షణాల్లో డీల్ పూర్తిచేయండి కొత్త ‘ఏసర్ టైమ్ లైన్’తో..!!

Posted By: Staff

ఇక క్షణాల్లో డీల్ పూర్తిచేయండి కొత్త ‘ఏసర్ టైమ్ లైన్’తో..!!


‘‘వ్యాపారవర్గాల సమయపాలనను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘ఏసర్’ వేగవంతంగా పనులను చక్కదిద్దిపెట్టే ‘ట్రావెల్‌మేట్ నోట్‌బుక్’ పరికరాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘ఏసర్ ట్రావెల్‌మేట్ టైమ్‌లైన్ 8481T’ మోడల్‌‌తో విడుదలవుతున్న ఈ సరికొత్త గ్యాడ్జెట్ ప్రయాణ సందర్భాల్లో మరింత చురుకుగా పనిచేస్తుంది. నిత్యం వ్యాపార లావాదేవీలతో తలమనకలయ్యే వ్యాపార వేత్తలకు ఈ అత్యాధునిక పరికరం చేదోడు వాదోడుగా నిలుస్తుంది.’’

క్లుప్తంగా ఫీచర్లు:

- కేవలం 1.45 కిలో గ్రాముల బరువుతో రూపొందించిన ఈ నోట్‌బుక్ పరికరాన్ని సులువుగా తీసుకెళ్లవచ్చు.

- 14 అంగుళాల పరిమాణం కలిగి ఉండే ఈ గ్యాడ్జెట్ మన్నికైన 9 గంటల బ్యాటరీ బ్యాకప్ వ్యవస్ధను కలిగి ఉంటుంది.

- 8481Tలో ఆప్టికల్‌డ్రైవ్ కరువైనప్పటికి, ఆ వెలితిని పూడుస్తూ నాణ్యమైన మ్యగ్నినిషియమ్ - ఆల్యూమినియమ్ యల్లాయ్ స్లిమ్ ఛాసిస్‌ను పొందుపరిచారు.

- విండోస్ 7 ప్రొఫెషినల్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా నోట్‌బుక్ పని చేస్తుంది.

- శక్తివంతమైన ప్రొసెసింగ్ వ్యవస్థ, 3జీబీ ర్యామ్, హై డెఫినిషన్ వీడియో వ్యవస్ధ, ఇంటెల్ హెచ్డీ 3000 గ్రాఫిక్ యూనిట్ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- 320జీబీ సామర్ధ్యం గల హార్డ్ డ్రైవ్, 64జీబీల ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ, అత్యాధునిక v3.0 బ్లూటూత్ వ్యవస్థ, 3జీ, వై-ఫై వంటి ఫీచర్లు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తాయి.

- వ్యాపర వేత్తలకు అనువుగా ఏర్పాటు చేసిన ఫైన్‌టచ్ మోడల్ కీబోర్డు వేగవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది. మల్టీటచ్ ఇన్‌పుట్ వ్యవస్థ మరో ప్రత్యేక ఆకర్షణ.

- ఎస్‌డీ కార్డ్ రీడర్, వై-ఫై స్విచ్, హెచ్డీఎమ్ఐ ఈ - సాటా పోర్టు, వీజీఏ అవుట్, ఇతర్ నెట్ RJ-45 జాక్ వంటి కనెక్టువిటీ అంశాలు పని వేగాన్నిమరింత సులభతరం చేస్తాయి.

- చివరిగా ధర అంశానికి వస్తే త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘ఏసర్ ట్రావెల్‌మేట్ టైమ్‌లైన్ 8481T’ ధర రూ. 50,000/ ఉండోచ్చని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting