వచ్చేది కూడా సూపర్ హిట్టే..?

Posted By: Super

ఉన్నతస్థాయి లక్షణాలతో ఏసర్ సంస్థ నుంచి రాబోతున్న మరో ల్యాప్‌టాప్ ‘టైమ్‌లైన్ యూ3’. ఎన్-విడియా 600ఎమ్ గ్రాఫిక్ వంటి అత్యాధునిక మొబైల్ గ్రాఫిక్ వ్యవస్థను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సరికొత్త ల్యాపీలోని ఫీచర్లు ఉపయుక్తమైన పనితీరు ప్రదర్శిస్తాయి.

కీలక ఫీచర్లు:

- తక్కువ వోల్టేజ్‌తో కూడిన కోర్ ఐ5 ప్రాసెసర్,

- 4జీబి ఇంటర్నల్ ర్యామ్,

- బరువు 2.3కిలోలు,

- 15.6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

- ల్యాపీ మందం 20మిల్లీమీటర్లు,

- జీ-ఫోర్స్ జీటీ640ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

 వచ్చేది కూడా సూపర్ హిట్టే..?

కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చటంలో ఈ ల్యాపీ పూర్తి స్థాయి అనువుగా ఉంటుంది. పొందుపరిచిన ఎన్-విడియా గ్రాఫిక్ వ్యవస్థ ఉత్తమ విలువలతో కూడిన మల్టీమీడియా అనుభూతులను చేరువచేస్తుంది. ఏర్పాటు చేసిన డీవీడీ ఆప్టికల్ డ్రైవ్ మ్యూజిక్ లవర్స్ అదేవిధంగా గేమింగ్ లవర్స్‌కు మరింత దోహదపడుతుంది. ల్యాపీలో అమలపరిచిన కోర్ ఐ5 ప్రాసెసర్ వేగవంతమైన పనితీరునందిస్తుంది. ఏర్పాటు చేసిన 15.6 అంగుళాల స్ర్కీన్ హై రిసల్యూషన్ పరిమాణాన్ని కలిగి అత్యుత్తమ విజువల్ మైమరుపును కలిగిస్తుంది.

ఇతర ల్యాపీలతో పోలిస్తే ఈ డివైజ్ బరువుగా ఉన్నప్పటికి ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా స్పందిస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అమర్చిన చిక్‌లెట్ స్టైల్ కీబోర్డ్ అనువైన టైపింగ్‌కు తోడ్పడుతుంది. మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వినియోగదారుకు మరింత నిశ్చింతనిస్తుంది. శక్తివంతమైన ల్యాప్‌టాప్ కోసం వేచిచూస్తున్న వారికి ఈ టైమ్‌లైన్ యూ3 అల్ట్ర్రా‌బుక్ బెస్ట్ ఛాయిస్.ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లో విడుదలకు సంబంధించి వివరాలు వెల్లడి కావల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot