‘జర్నీ’లో సుఖవంతమైన కంప్యూటింగ్!

Posted By: Super

‘జర్నీ’లో సుఖవంతమైన కంప్యూటింగ్!

 

ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను కోరుకునే వారికి ఏసర్ సంస్థ తాజాగా రూపొందించిన ల్యాప్‌టాప్ ‘ట్రావెల్ మేట్ పీ243’ఉత్తమమైన ఎంపిక. తక్కువ బరువు కలిగి 14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌తో డిజైన్ కాబడిన ఈ డివైజ్ శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌ను ఒదిగి ఉంది.

ల్యాపీలోని పలు ముఖ్య ఫీచర్లు:

14 అంగుళాల స్ర్కీన్,

రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,

కోర్ ఐ5 ఐవీ ‌బ్రిడ్జ్ ప్రాసెసర్,

ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 630ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఇంటెల్ చిప్‌సెట్,

హై డెఫినిషన్ వెబ్‌క్యామ్,

హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,

8జీబి ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

స్పీకర్స్, ఆడియో జాక్,

ధర రూ.30,000.

నిక్షిప్తం చేసిన ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీ ల్యాపీ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది. మరో వ్యవస్థ ఎన్-విడియా జీఫోర్స్ గ్రాఫిక్ యూనిట్ ఉత్తమ క్వాలిటీ మల్టీ మీడియా అనుభూతులను చేరువ చేస్తుంది. ఏర్పాటు చేసిన 14 అంగుళాల డిస్‌ప్లే మన్నికైన దృశ్య ప్రదర్శనను కనబరుస్తుంది. నిక్షిప్తం చేసిన హైడెఫినిషన్ వెబ్‌క్యామ్ ద్వారా అంతరాయంలేని ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. ఆడియో ఇంకా వీడియో అంశాలను హైడెఫినిషన్ శ్రేణిలో ఆస్వాదించవచ్చు. పొందుపరిచిన మరో ఫీచర్ ‘ఏసర్ ప్రోషీల్డ్ సెక్యూరిటీ’ ల్యాపీ భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. బ్యాటరీ మన్నికైన బ్యాకప్ నిస్తుంది.

ఏసర్ ట్రావెల్‌మేట్ పీ243 ధర అంచనా రూ.30,000. తొలత ఈ గ్యాడ్జెట్‌ను యూకెలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణ సందర్భాల్లో కంప్యూటింగ్ నిర్వహించుకునే వారికి ట్రావెల్ మేట్ పీ243 బెస్ట్ ఛాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot