రిలీజ్‌కు ముందే రికార్డులు..?

Posted By: Staff

రిలీజ్‌కు ముందే రికార్డులు..?

 

మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8. ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే తొలి టాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేసిన ఘనత ఏసర్‌కు దక్కింది. విండోస్ 8 ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే రెండు టాబ్లెట్ పీసీలను ఏసర్ డిజైన్ చేసింది. ఐకోనియా W700, ఐకోనియా W510 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్‌లు అమ్మకాల విషయంలో ఏ విధమైన ట్రెండ్‌ను సృష్టిస్తాయో వేచి చూడలి.

ఏసర్ ఐకోనియా డబ్ల్యూ 700:

11.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ 1920 x 1080 రిసల్యూషన్‌ను కలిగి క్లారిటీతో కూడిన విజువల్ అనుభూతులకు లోను చేస్తుంది. అ టాబ్లెట్‌కు కీబోర్డును జత చేసుకుని డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌కు ఉపయోగించకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు.ఏర్పాటు చేసిన యూఎస్బీ 3.0 వర్షన్ పోర్టులు డేటాన వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. పొందుపరిచిన డాల్బీ హోమ్ ధియోటర్ వ్యవస్థ మన్నికైన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. టాబ్లెట్ వెనెుక భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉన్నతమైన ఫోటోగ్రపీ విలవలను కలిగి ఉంటంది.

ముందుభాగంలో అనుసంధానించిన కెమెరా ప్రత్యక్ష వీడియో చాటింగ్‌కు సహకరిస్తుంది. ధర అంచనా రూ.40,000 నుంచి రూ. 50,000 మధ్య. ఇతర మోడళ్లకు సంబంధించి స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.

‘ఐకోనియా టాబ్ డబ్ల్యూ510’ 10.1 అంగుళాల స్ర్కీన్ పరిమాణంతో 295 డిగ్రీ యాంగిల్ వ్యూను కలిగి ఉంటుంది. పొందుపరిచిన ట్రైమోడ్ ఫీచర్‌తో యూజర్ డివైజ్‌ను టచ్, టైప్, వ్యూ విధానాల్లో ఉపయోగించుకోవచ్చు. టైపింగ్‌కు మరింత అనువుగా డిటాచబుట్ కీబోర్డ్ డాక్‌ను ఈ డివైజ్ ద్వారా పొందవచ్చు. ఈ డివైజ్ కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్ ల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot