రూ.4,999కే హై‌కాన్ఫిగరేషన్ ల్యాప్‌టాప్!

Posted By: Staff

రూ.4,999కే  హై‌కాన్ఫిగరేషన్ ల్యాప్‌టాప్!

ముంబై: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్స్ తయారీ సంస్థ అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసీఐ), రూ.4999 విలువ చేసే హై‌కాన్ఫిగరేషన్ ల్యాప్‌టాప్‌ను భారత విపణిలో ప్రవేశపెట్టింది. ఐకాన్ -1100 మోడల్‌లో డిజైన్ కాబడిన ల్యాపీలను అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఆసియా) సంస్థలు విక్రయించనున్నాయి. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏసీఐ ఆసియా విభాగం ఎండీ హిజ్రి పటేల్ స్పందిస్తూ తొలి ఏడాదిలో భాగంగా 2 లక్షల ల్యాప్‌టాప్‌లను విక్రయించాలని నిశ్చయంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఏసీఐ ఐకాన్- 1100 కీలక ఫీచర్లు:

10.2 అంగుళాల ఎల్‌ఈడి స్ర్కీన్,

విండోస్ ఆపరేటింగ్ సిస్టం,

వీఐఏ ప్రాసెసింగ్ యూనిట్,

512ఎంబీ ర్యామ్ (1జీబి ఆప్షనల్),

4 జీబీ అంతర్గత స్టోరేజి,

మైక్రోఎస్‌డి కార్డ్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వెబ్‌క్యామ్,

యూఎస్బీ 2.0 వర్షన్ పోర్ట్స్ (3),

వై-ఫై,

3జీ సపోర్ట్ వయా డాంగిల్,

12 నెలల రీప్లేస్‌మెంట్ వారంటీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot