అందరి అవసరాలకు ‘హెచ్‌పీ G62-340US’

Posted By: Super

అందరి అవసరాలకు ‘హెచ్‌పీ G62-340US’

 

విద్యార్థులు అదేవిధంగా వ్యాపారవేత్తల అవసరాలను తీర్చటంలో కంప్యూటింగ్ పరికరాలు సఫలీకృతమవుతున్నాయి. విద్యా, వ్యాపార లావాదేవీలకు సంబంధించి సాంకేతిక వ్యవస్ధ మరింత దోహదపడటంతో నేటి తరం విద్యార్థులు అదేవిధంగా వ్యాపారవేత్తలు ఈ పరిజ్ఞానం పైనే ఆధారపడుతున్నారు.

కంప్యూటింగ్ పరికరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఆధునిక కంప్యూటింగ్ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఈ కోవలోనే అంతర్జాతీయ సాంకేతిక పరికరాల తయారీదారు హెచ్ పీ(HP) మన్నికైన స్పెసిఫికేషన్లతో ‘G62 సిరీస్‌లో 340US వర్షన్ నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

క్లుప్తంగా ఈ ల్యాపీ ఫీచర్లు:

- 15.6 అంగుళాల హై డెఫినిషన్ LED డిస్ ప్లే, స్క్ర్రీన్ రిసల్యూషన్ 1366 x 768 పిక్సల్స్,

- 64 బిట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

- 2.2 GHz Athlon II డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- A 320 జీబీ సాటా హార్డ్ డిస్క్,

- పటిష్టమైన ర్యామ్ వ్యవస్థ,

- ATI రాడియాన్ HD 4250 గ్రాఫిక్ యాక్సిలరేట్ యూనిట్,

- 1జీబీ గ్రాఫిక్, వీడియో మెమరీ,

- 3జీబీ ఎస్డీ ర్యామ్,

- 720p HD వీడియో ప్లేబ్యాక్,

- మైక్రో ఫోన్ సౌకర్యంతో వెబ్ క్యామ్ సౌలభ్యత,

- డీవీడీ బర్నర్,

- 10/100 బేస్ Tఇతర్ నెట్ ల్యాన్, వై ఫై,

- సౌండ్ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తూ అత్యాధునిక ‘ఆల్టెక్ ల్యాన్సింగ్’ స్పీకర్లను ల్యాపీలో అనుసంధానం చేశారు,

- 2.0 సామర్ద్యం గల యూఎస్బీ పోర్ట్సు (3), 15 పిన్ వీజీఏ పోర్ట్ మరియు హెచ్డీఎమ్ఐ పోర్టు.

- 5 in 1 మెమరీ కార్డ్ రీడర్

- బ్యాటరీ బ్యాకప్ సామర్ద్యం 4 గంటలు,

- ధర రూ.25,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot