మీ రూపాయికి ఖచ్చితమైన విలువ...!

Posted By: Staff

మీ రూపాయికి ఖచ్చితమైన విలువ...!

 

చవక ఆండ్రాయిడ్ టాబ్లెట్ ‌లకు మార్కెట్లో ఊహించని ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ సంస్థ ఐనోల్ నోవో పాలాడిన్  (Ainol Novo Paladin) స్లీక్ డిజైన్‌తో కూడిన

చవక టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ డివైజ్ పని చేస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో  లోడ్ కాబడిన ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్ విలువ రూ.7990. అత్యాధునిక కంప్యూటింగ్ ఫీచర్లను ఈ పీసీలో నిక్షిప్తం చేశారు.

Read In English:

Ainol Novo 7 Paladin టాబ్లెట్‌లోని ముఖ్య విశేషాలు:

-   స్లీక్ మరియు పల్చటి డిజైనింగ్, జేబులో సౌకర్యవంతంగా ఇమిడేతత్వం.

-   7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

-   ఇంటర్నెట్ వ్యవస్థను సపోర్ట్ చేస్తుంది.

-   ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్ కొరకు డివైజ్ లో 1జిగాహెడ్జ్ సామర్ధ్యం గల సింగిల్ కోర్ ప్రాసెసర్ ను దోహదం చేశారు.

-   3జీ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ.

-   ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

-   8జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్,

-   వన్‌టచ్ గుగూల్ ప్లే యాక్సిస్,

-   మన్నికైన బ్యాకప్ నిచ్చే 400 mAh బ్యాటరీ.

ఫేస్‌బుక్ ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించి సౌలభ్యత ఉంటుంది. మీరు పెట్టే  రూ.7990 పెట్టుబడికి పూర్తి స్ధాయి భరోసాను ఈ డివైజ్  కల్పిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot