హైదరాబాద్‌లో ‘పబ్లిక్ వై-ఫై’ సర్వీసులను ఆవిష్కరించిన ఎయిర్‌టెల్

Posted By:

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌టెల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘పబ్లిక్ వై-ఫై' సర్వీసులను శుక్రవారం హైదరాబాద్ నగరంలో ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ ప్రయోగాత్మక పబ్లిక్ వై-ఫై సేవలను లాంఛనంగా ప్రారంభించారు. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్ర్రాంతాలలోని సుమారు ఎనిమిద కిలోమీటర్ల పరిధి మేర 17 పబ్లిక్ లోకేషన్‌లలో ఈ ఉచిత వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

హైదరాబాద్‌లో ‘పబ్లిక్ వై-ఫై’ సర్వీసులను ఆవిష్కరించిన ఎయిర్‌టెల్

ఈ పబ్లిక్ వైఫై లోకేషన్‌ల వద్ద ఒక్కో వినియోగదారుడు రోజుకు 750 ఎంబి వరకు ఉచిత ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చని భారతి ఎయిర్‌టెల్ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభాగాల సీఈఓ వెంకటేషన్ విజయరాఘవన్ వెల్లడించారు.

ఆవిష్కరణ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే హైదరాబాద్ నగరాన్ని వై-ఫై నగరంగా అభివృద్థి చేస్తామని, ఈ సేవలను అందించేందుకు గాను త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ సహకారంతో ఈ 17 పబ్లిక్ సెంటర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నాలుగు నెలల్లో హైదరాబాద్ నగరాన్ని వై-ఫై నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Airtel Launches 'Public Wi-Fi' Service in Hyderabad. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot