మంత్రి గారు ఆదివారం చెప్పారు!

Posted By: Super

మంత్రి గారు ఆదివారం చెప్పారు!

అప్‌గ్రేడెడ్ వర్షన్ తక్కువ ధర టాబ్లెట్ పీసీ ఆకాష్ 2ను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి కపిల్ సిబాల్ ఆదివారం తెలిపారు. ఆకాష్ 2లో పొందుపరిచిన శక్తివంతమైన 800మెగాహెట్జ్ ప్రాసెసర్ బ్యాటరీ మన్నికను మరింత పటిష్టం చేస్తుంది. త్వరలో లక్ష ఆకాష్ 2 టాబ్లెట్‌లను ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు పంపిణి చేయునున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

ఆకాష్ 2లో మెరుగుపరచబడిన ఫీచర్లు:

ఆకాష్ టాబ్లెట్ సాధారణ టచ్ స్ర్కీన్‌తో పోలిస్తే, ఆకాష్ 2లో ఏర్పాటు చేసిన సమర్థవంతమైన టచ్‌స్ర్కీన్ స్మార్ట్ ఆపరేటింగ్‌కు దోహదపడుతుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం అత్యుత్తమ ఫీచర్లను కలిగి యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను చేరువచేస్తుంది. ఆకాష్‌లో లోపించిన జీపీఆర్ఎస్ కనెక్టువిటీని ఆకాష్2లో ఏర్పాటు చేశారు. ఎక్సటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని 2జీబి నుంచి 4జీబి వరకు పొడిగించారు. అమర్చిన 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర అంచనా రూ.4,000.

ఆకాష్-2:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, కార్టెక్స్ ఏ8 800 మెగాహెడ్జ్ ప్రాసెసర్, హై డెఫినిషన్ వీడియో ప్రాసెసర్, వీజీఏ ఫ్రంట్ కెమెరా, హై క్వాలిటీ వీడియో రికార్డింగ్, 256 ఎంబీ ర్యామ్, 4జీబి ఫ్లాష్ మెమెరీ, జీపీఆర్ఎస్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, డేటావిండ్ యూబీ సర్ఫర్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, బ్యాటరీ స్టాండ్ బై 3గంటలు, రిటైల్ మార్కెట్లో ధర అంచనా రూ.4,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot