మూడు లక్షల ‘ఆకాష్’లకు ఆర్డర్లు!!

Posted By: Staff

మూడు లక్షల ‘ఆకాష్’లకు ఆర్డర్లు!!

 

సామాన్య, మధ్య తరగతి వినియోగదారులకు కంప్యూటింగ్ వ్యవస్థను మరింత చేరువు చేస్తూ ప్రయోగాత్మకంగా డిజైన్ కాబడ్డ ఆకాష్ టాబ్లెట్ పీసీలకు మార్కెట్లో అసాధారణ డిమాండ్ నెలకుంది. ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధరను రూ.3000గా నిర్థారించటంతో, ఇప్పటికే తమకు మూడు లక్షల పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆకాష్ టాబ్లెట్ పీసీలను ఉత్పత్తి చేస్తున్న డాటావిండ్ సంస్ధ వెల్లడించింది.

రూ.2250 సబ్సిడీ ధరకు విద్యార్థులకు, విద్యా సంస్థలకు ఆకాష్ టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాణిజ్య స్థాయిలో రూ.3000 ధరకు ఈ టాబ్లెట్ పీసీలను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రిలయన్స్, శ్యామ్‌సంగ్, ఆపిల్ ప్రధాన పోటీదారులుగా బరిలోకి దిగిన ‘ఆకాష్’కు వినియోగదారుల నంచి అనూహ్యస్పందన లభిస్తోంది. భారతీయ సెక్టార్లో ‘ఆకాష్’ టాబ్లెట్ పీసీల మార్కెట్ రెండున్నర లక్షలుంటుందని అంచనా వేసిన విశ్లేషకులకు దిమ్మతిరిగేలా ఊపందుకుంటున్న బుకింగ్స్ ఇప్పటికే మూడు లక్షలు దాటాయి. ఆడ్వాన్స్ బుకింగ్స్‌కు డబ్బులేమి వసూలు చేయ్యటం లేదని డాటా విండ్ సీఈవో సునీత్ సింగ్ తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting