చైనాలో ‘ఆపిల్ కోట’కు బీటలు??

Posted By: Staff

చైనాలో ‘ఆపిల్ కోట’కు బీటలు??

‘‘ చైనాలో దూసుకుపోతున్న ఆపిల్ కు ముప్పు వాటిల్లనుందా..?, ఆలీబాబా రూపంలో ఈ ముసురు కమ్ముకోనుందా..?, రానున్న కాలంలో ‘ఆపిల్’కు గడ్డు పరిస్థితులు తప్పవా..?, అవుననేనంటుంది చైనా ‘ఇ-కామర్స్ కంపెనీ’

ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘ఆలీబాబా’ ఆలియన్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారిత టాబ్లెట్ పీసీని చైనా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ ‘ఆపిల్ ఐప్యాడ్’కు ధీటైన జావాబునిస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

చైనా సాంకేతిక వినియోగదారులకు సుపరిచితమైన ఆల్యన్ ( Aliyun) ఆపరేటింగ్ వ్యవస్థను ‘ఆలీబాబా’ సంస్ధ రూపొందిస్తున్న టాబ్లెట్లో ప్రవేశపెట్టడం ‘ప్లస్ పాయింట్’ని విశ్లేషక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. లైనెక్స్ ప్లాట్ ఫామ్ ఆధారితంగా ‘టియన్యు’సంస్థ అలియన్ ( Aliyun) ఆపరేటింగ్ వ్యవస్థను వృద్థి చేసినట్లు తెలుస్తోంది.

చైనా సాంకేతిక మార్కెట్లో అత్యధిక అమ్మకాల వాటాను కైవసం చేసుకున్న ‘ఆపిల్’ తాజాగా అక్కడ ‘షాంగాయ్ ఆపిల్ స్టోర్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. చైనా మార్కెట్లో ‘నెం.1 బ్రాండ్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆపిల్ ఈ తాజా ఎదురుదాడిని ఎలా ఎదుర్కొంటుదో వేచి చూడాలి. విడుదల కాబోతున్న ఆలీబాబా టాబ్లెట్ ‘య్యాన్ ప్యాడ్’ పేరుతో విడుదల కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot