మీ కొత్త కంప్యూటర్ ఎంపికకు ఇవిగోండి సలహాలు

Posted By:

నిత్యనూతనమైన టెక్ ప్రపంచంలో ఎవరు రారాజు కాదు. డెస్క్‌టాప్ కంప్యూటర్ అంటే ఒకప్పుడు వింత ఇప్పుడు చింత. కారణం డెస్క్‌టాప్ పీసీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేస్తుంది. డెస్క్‌టాప్ పీసీలకు పోటీగా ఆల్-ఇన్-వన్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ పీసీలు స్లిమ్ తత్వాన్నికలిగి కేవలం కొద్ది స్థలాన్నిమాత్రమే ఆక్రమిస్తాయి. వైర్లు అక్కర్లేదు. కీబోర్డ్ ఇంకా మౌస్‌లు బ్లూటూత్ సాయంతో స్పందిస్తాయి. కంప్యూటింగ్ ప్రపంచలోకి ఇటీవల కాలంలో అడుగుపెట్టిన ‘ఆల్ ఇన్ వన్ కంప్యూటర్'లు కస్టమర్ దేవుళ్లకు సైతం హాట్ ఫేవరేట్‌గా నిలుస్తున్నాయి. మీ కొత్త కంప్యూటర్ ఎంపికలో భాగంగా ‘ఆల్-ఇన్-వన్ పీసీ', ‘డెస్క్‌టాప్ పీసీ'ల మధ్య వత్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

డెస్క్‌టాప్ పీసీ:

డెస్క్‌టాప్ పీసీలో.. సీపీయూ, మానిటర్‌లు వేరువేరుగా ఉంటాయి. మౌస్ ఇంకా కీబోర్డ్‌లను వైర్ల సాయంతో అనుసంధానించాల్సి ఉంటుంది.

 

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

డెస్క్‌టాప్ పీసీ అనుకూలతలు:

- ఆల్-ఇన్-వన్ పీసీలతో పోలిస్తే తక్కువ ధరకే లభ్యమవుతుంది.
- డెస్క్‌టాప్ పీసీ పై కంప్యూటింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

 

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

డెస్క్‌టాప్ పీసీ అనుకూలతలు:

- భాగాలు ఇంకా ఉపకరణాలు అత్యంగా అనుకూలంగా వ్యవహరిస్తాయి.
- గేమింగ్ ఇంకా ఆఫీస్ ప్రయోజనాలకు డెస్క్‌టాప్ పీసీని భేషుగ్గా ఉపయోగించుకోవచ్చు.

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

డెస్క్‌టాప్ పీసీ ప్రతికూలతలు:

ఎక్కువ చోటును ఆక్రమిస్తుంది.

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

డెస్క్‌టాప్ పీసీ ప్రతికూలతలు...


క్లీనింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది.
విడి భాగాలను వేరువేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

ఆల్-ఇన్-వన్ పీసీ:

ఈ స్లిమ్ కంప్యూటింగ్ పీసీలో సీపీయూ ఇంకా మానిటర్‌లు ఒకే చోట పొదిగి ఉంటాయి. కీబోర్డ్ ఇంకా మౌస్‌లను బ్లూటూత్ సాయంతో వైర్‌లెస్ ఆధారంగా ఆపరేట్ చేసుకోవచ్చు.

 

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

ఆల్-ఇన్-వన్ పీసీలోని సాధారణ ఫీచర్లు:

బుల్ట్ ఇన్ సీడీ/డీవీడీ/బ్లూరే డ్రైవ్స్,
టచ్‌స్ర్కీన్,
4+ యూఎస్బీ 2.0 పోర్ట్స్,
బుల్ట్-ఇన్ వైర్‌లెస్ సిస్టం.

 

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

ఆల్-ఇన్-వన్ పీసీలోని ప్రయోజనాలు:

ఈ పీసీలు తక్కువ స్థలాన్నిమాత్రమే ఆక్రమిస్తాయి.
అన్ని ఒకే చోట ఉంటాయి.
టచ్‌స్ర్కీన్ కంప్యూటింగ్ కొత్త అనుభూతులకు లోను చేస్తుంది.

 

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

ఆల్-ఇన్-వన్ పీసీలోని ప్రయోజనాలు:

కీబోర్డ్ ఇంకా మౌస్‌లను బ్లూటూత్ సాయంతో వైర్‌లెస్ ఆధారితంగా ఆపరేట్ చేసుకోవచ్చు.
పర్సనల్ కంప్యూటింగ్‌కు ఆల్-ఇన్-వన్ పీసీలు ఉత్తమ ఎంపిక.

 

మీకు ఎలాంటి కంప్యూటర్ మంచిది..?

ఆల్-ఇన్-వన్ పీసీలోని ప్రతికూలతలు:

విస్తరణకు అనువగా ఉండదు.
డెస్క్‌టాప్ పీసీలతో పోల్చితే ధర ఎక్కువ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Desktop PCs, because of their customization opportunity, make the best choices for the gaming computer route...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot