5,000లకే ఆకర్షణీయమైన ల్యాప్‌టాప్!

Posted By: Super

 5,000లకే ఆకర్షణీయమైన ల్యాప్‌టాప్!

 

యూకెకు చెందిన ప్రముఖ ల్యాప్‌టాప్‌ల బ్రాండ్ ఏసీఐ, ఆసియాకు చెందిన అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సారధ్యంలో తక్కువ ఖరీదు కలిగిన ల్యాప్‌టాప్‌ను భారత్ మార్కెట్లో విక్రయించనుంది. జూన్ 15నాటికి అందుబాటులోకి రానున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.4,999. పూర్తి స్థాయి విండోస్ ఆధారితంగా స్పందిస్తుంది.

ఈ అంశం పై అలైడ్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ హిర్జీ పటేల్ స్పందిస్తూ తక్కువ ధర కలిగిన ల్యాప్‌టాప్‌ను ఇండియాలో కేవలం రూ.4,999కి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థను 2002 మేలో నెలకొల్పామని, వినూత్న డిజైన్లలో తయారుకాబడిన అనేక

ల్యాప్‌టాప్‌లతో పాటు పర్సనల్ కంప్యూటర్లను తమ సంస్థ ద్వారా దేశానికి పరిచయం చేసినట్లు పటేల్ తెలిపారు.

కాగా, ఏసీఐ మరిన్ని వేరియంట్‌లలో ల్యాప్‌టాప్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. రూ.4,999 విలువ కలిగిన ల్యాపీ 10 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. మరో ల్యాపీని రూ. 9,999కే విక్రయించనున్నారు. ఇంటెల్ ఐ3 ప్రాసెసర్ కలిగిన మరో వేరియంట్‌లో రూపుదిద్దుకున్న ల్యాప్‌టాప్‌‌ను రూ.19,999కి విక్రయించనున్నారు. ఇవే కాకుండా ఇంటెల్ ఐ7 ప్రాసెసర్ కలిగి 32జీబి ర్యామ్ వ్యవస్థతో పనిచేసే శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను రూ.49,999ధరకు పరిచయం చెయ్యనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot