Amazon Freedom Sale 2020: రూ.10 వేల లోపు ధరలో ఉత్తమమైన PC మానిటర్లు ఇవే....
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రస్తుతం ఇండియాలో ఫ్రీడమ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నేటితో ముగుస్తుంది. ఈ అమ్మకం సమయంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు వంటి మరెన్నో ఉత్పత్తుల మీద కంపెనీ గొప్ప తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుత అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో రూ.10,000 లోపు లభించే ఐదు PC మానిటర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Lenovo D24-10
లెనోవా D24-10 PC మానిటర్ అనేది LED బ్యాక్‌లైట్‌తో వస్తుంది. 23.6-అంగుళాల TN ప్యానల్‌తో కూడిన ఈ మానిటర్ అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఫుల్ HD రిజల్యూషన్ తో వస్తుంది. అలాగే ఇది 170-డిగ్రీల వీక్షణ కోణం మరియు 1ms ప్రతిస్పందన సమయంతో వస్తుంది. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడానికి TUV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ మరియు ఫ్లికర్-ఫ్రీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుత అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో దీని రూ.8,349 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

LG 22MP68VQ
LG 22MP68VQ PC మానిటర్ ను ఇప్పుడు అమెజాన్ లో రూ.7,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 1 VGA పోర్ట్, 1 HDMI పోర్ట్, 1 DVI పోర్ట్, 1 ఆడియో-అవుట్ పోర్ట్ మరియు 3.5mm హెడ్-ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగిన ఈ మానిటర్ 22-అంగుళాల ఫుల్ HD బోర్డర్‌లెస్ IPS ప్యానెల్ తో వస్తుంది. ఇది 5ms ప్రతిస్పందన రేటు మరియు 178-డిగ్రీల వీక్షణ కోణంతో 60Hz డిస్ప్లే ప్యానెల్ ను కలిగి ఉంది.

Samsung LC24F390FHWXXL
శామ్సంగ్ సంస్థ రూ.8,999 ధర వద్ద అందిస్తున్న శామ్సంగ్ LC24F390FHWXXL PC మానిటర్ 1920 × 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 23.5-అంగుళాల ఫుల్ HD VA ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ మానిటర్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4ms ప్రతిస్పందన సమయాన్ని కలిగి ఉంది. ఇది 1800R యొక్క స్క్రీన్ వక్రతను కలిగి ఉంది మరియు ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తుంది.

BenQ GW2480
BenQ GW2480 PC మానిటర్ ను ప్రస్తుత అమెజాన్ ఫ్రీడమ్ అమ్మకంలో రూ.9,490 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. ఈ మానిటర్ సంస్థ యొక్క స్వంత ఐ కేర్ టెక్నాలజీతో వస్తుంది. ఇది తన 23.8-అంగుళాల డిస్‌ప్లేను ఫుల్ HD రిజల్యూషన్‌తో మరియు ఎడ్జ్ టు ఎడ్జ్ ఫీచర్ ప్యానల్‌తో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 5ms ప్రతిస్పందన సమయం మరియు 178-డిగ్రీల వీక్షణ కోణాన్ని కలిగి ఉండడమే కాకుండా ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ మద్దతుతో వస్తుంది.

Acer ET221Q
Acer ET221Q PC మానిటర్ 21.5-అంగుళాల పరిమాణంలో ఉండే IPS డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది సౌకర్యవంతమైన వీక్షణ కోసం -5 నుండి 20 డిగ్రీల వంపు కోణంతో వస్తుంది. అలాగే ఇది బ్లూ లైట్ షీల్డ్ మరియు ఫ్లికర్ లెస్ టెక్నాలజీ మద్దతుతో లభిస్తుంది. ఈ మానిటర్ యొక్క డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4ms ప్రతిస్పందన సమయంతో వస్తుంది. దీని ఇప్పుడు రూ.7,099 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








