అమెజాన్ ఇండియా కొత్త సర్వీస్ ‘విడుదల రోజే డెలివరీ’

Posted By:

 అమెజాన్ ఇండియా కొత్త సర్వీస్ ‘విడుదల రోజే డెలివరీ’

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ఆన్‌లైన్ షాపింగ్‌కు విపరీతమైన క్రేజ్ నెలకున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, ఈబే తదితర ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఉత్పత్తులను వేగవంతంగా డెలివరీ చేసేందుకు సరికొత్త సర్వీసులను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్ ఇండియా, రిలీజ్ డే డెలివరీ (ఆర్‌డిడి) పేరుతో సరికొత్త సర్వీసును ప్రారంభించింది.

ఒక ప్రొడక్ట్‌ను ముందుగానే బుక్ చేసుకునే యూజర్లకు ఆ ఉత్పత్తి విడుదలైన మొదటి రోజునే వారివారి అడ్రస్‌లకు అందచేయటమే ఈ సర్వీస్ ప్రధాన లక్ష్యం. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ రోజు ప్రారంభ క్షణాల్లో విడుదల చేసిన సరికొత్త ఎక్స్‌బాక్స్ వన్ గేమింగ్ కన్సోల్స్‌ను రిలీజ్ డే డెలివరీ సర్వీసులో భాగంగా ముందస్తుగా బుక్ చేసుకున్న బెంగుళూరు, ముంబయ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పూణే, అహ్మదాబాద్, నాగ్‌పూర్ నగర వాసులకు అమెజాన్ ఇండియా అర్థరాత్రి డెలివరీల ద్వారా ఎక్స్‌బాక్స్ వన్ గేమింగ్ కన్సోల్స్‌ను అందజేసింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Amazon India Officially Introduces Release Day Delivery; To Deliver Products on Day of Launch. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot