సమవుజ్జీల మధ్య ‘వార్’..?

Posted By: Prashanth

సమవుజ్జీల మధ్య ‘వార్’..?

 

టాబ్లెట్ కంప్యూటర్ల సెక్టార్ లో ఆపిల్ ఐప్యాడ్ కు ధీటుగా నిలిచిన మొనగాడు బ్రాండ్ ‘ఆమేజోన్స్ కిండిల్ ఫైర్’ తాజాగా మరో సమవుజ్జీతో తలపడుతోంది. కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీలోని అంశాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘నోబుల్ నోక్’ టాబ్లెట్ రూపుదిద్దుకుంది. సమానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్ లతో ‘ఢీ’కొనబోతున్న ఈ టాబ్లెట్ పీసీల ముఖ్య విశేషాలు...

‘ఆమేజోన్ కిండిల్ ఫైర్’ ప్రధాన ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్, పిక్సల్ రిసల్యూషన్ 1024*600, * డ్యూయల్ కోర్ A9 OMAP4 ప్రాసెసర్ (1 GHz), * ర్యామ్ 512 ఎంబీ, * టాబ్లెట్ ఇంటర్నల్ స్టోరేజి 8జీబి,

* వెబ్ బ్రౌజర్, హెచ్టీఎమ్ఎల్ సపోర్ట్, * వై-ఫై కనెక్టువిటీ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్.

‘నోక్ టాబ్లెట్ ’ ప్రధాన ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * డ్యూయల్ కోర్ TI 4430 ప్రాసెసర్ (1 GHz), * 7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్, పిక్సల్ రిసల్యూషన్ 1024*600, * 1జీబి ర్యామ్, * PWERVR SGX540 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, * 16జీబి eMMC రోమ్, * స్టోరేజ్ సామర్ధ్యం 11జీబి, * యాక్సిలరోమీటర్, * వై-ఫై కనెక్టువిటీ సపోర్ట్, * 3.5mm ఆడియో జాక్.

యూఎస్బీ కేబుల్ ఆధారితంగా ఈ టాబ్లెట్ పీసీలను ఛార్జ్ చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన డిజైన్ లో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీలు పనితీరు విషయంలో ఒకదాని మించి మరొకటి పోటీపడతాయి. ఇండియన్ మార్కెట్లో ఈ టాబ్లెట్ పీసీల ధరలు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot