అమెజాన్ టాబ్లెట్ విశ్వరూపం త్వరలో...

Posted By: Super

 అమెజాన్ టాబ్లెట్ విశ్వరూపం త్వరలో...

 

టాబ్లెట్ పిసి సెగ్మెంట్లో మొదటి సారి 'అమెజాన్ కిండల్ ఫైర్' వచ్చినప్పడు యూజర్స్‌ ఏమంత ఉత్సాహాం చూపించనప్పటికీ... ఈ టాబ్లెట్‌లో ఉన్న మంచి ఫీచర్స్, తక్కువ ధర వినియోగదారులను ఆకర్షితులను చేస్తున్నాయనేది నమ్మలేని నిజం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాబ్లెట్లకి 'అమెజాన్ కిండల్ ఫైర్' గట్టి పోటీనిస్తుందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు. ఇందులో ఉన్న అధ్బుతమైన ఫీచర్సే ఎక్కువ మంది దృష్టిని దీనిపై పడేలా చేశాయి.

ఈ సందర్బంలో ఆసియా ఫసిఫిక్ ఎనలిస్ట్ నిపుణుడు 'చాద్ బార్ట్లీ' మాట్లాడుతూ ఒక్క 2012 సంవత్సరంలో అమెజాన్ కిండల్ ఫైర్ టాబ్లెట్లు ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల యూనిట్లు అమ్ముడై సేల్స్ ఒక్కసారిగా పెంచాయి. గతయేడాది కేవలం 12.7యూనిట్లు అమ్ముడైన విషయం తెలిసిందే. మార్కెట్లో ఉన్న సేల్స్ ని దృష్టిలో పెట్టుకోని త్వరలో మార్కెట్లోకి 7 ఇంచ్, 9 ఇంచ్ టాబ్లెట్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ  వర్గాలు ధృవీకరించాయి.

గతంలో ఉన్న టాబ్లెట్‌ డిస్ ప్లే సైజుని 7 ఇంచ్‌లకు మార్పు చేసి, అదే ఫీచర్స్‌తో విడుదల చేయనున్నారు. ఐతే 9 ఇంచ్ టాబ్లెట్‌కి మాత్రం కొత్త ఫీచర్స్‌ని జత పరచనున్నట్లు తెలిపారు. వన్ ఇండియా పాఠకులకు మరొక్కసారి 'అమెజాన్ కిండల్ ఫైర్' టాబ్లెట్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'అమెజాన్ కిండల్ ఫైర్' టాబ్లెట్ ప్రత్యేకతలు:

సిపియు: Texas Instruments Cortex A9 OMAP4

ప్రాసెసర్: Speed 1 GHz

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 or earlier

స్క్రీన్ రిజల్యూషన్: 1024 x 600 pixels

స్కీన్ సైజు: 7 inches

బ్యాటరీ: 4 hours 55 minutes

స్టోరేజి కెపాసిటీ: (as Tested) 8 GB

చుట్టుకొలతలు: 4.7 x 7.5 x 0.45 inches

బరువు: 14.6 oz

నెట్ వర్కింగ్ ఆప్షన్స్: 802.11b, 802.11g, 802.11n

ఈ మెయిల్:Email Access Dedicated email app

వెబ్ బ్రౌజర్: Yes

ఫ్లాష్ సపోర్ట్:  Yes

కెమెరా: None

వీడియో ఛాట్: No

మ్యూజిక్ ఫార్మెట్స్: AAC, MP3, OGG, WAV

ఫోటో ఫార్మెట్స్: JPEG, TIFF, PNG, GIF

వీడియో ఫార్మెట్స్: MPEG4, H.264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot