అమెజాన్ కైండిల్‌ఫైర్ పేపర్‌వైట్ ఇ-బుక్ రీడర్లు

Posted By:

ప్రముఖ రిటైలర్ అమెజాన్ తన కైండిల్ సిరీస్ నుంచి సెకండ్ జనరేషన్ పేపర్‌వైట్ ఇ-బుక్ రీడర్లను మార్కెట్లో విడుదల చేసింది. ఇవి వై-ఫై ఇంకా 3జీ వేరియంట్‌లలో లభ్యంకానున్నాయి . వై-ఫై వేరియంట్ ధర రూ.10,999. 3జీ వేరియంట్ ధర రూ.13,999.

అమెజాన్ కైండిల్‌ఫైర్ పేపర్‌వైట్ ఇ-బుక్ రీడర్లు

అమెజాన్ ఇ-బుక్ రీడర్లు దేశవ్యాప్తంగా 250 రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు, హైదరాబాద్, చండీఘడ్, అహ్మదాబాద్ ఇంకా పూణేలోని క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇ-జోన్, విజయ సేల్ స్టోర్స్ వద్ద ఈ పరికరాలను కొనుగోలు చేయవచ్చు.

ఈ సరికొత్త కైండిల్ పేపర్‌వైట్ రీడర్లు 6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. రిసల్యూషన్ సామర్ద్యం 1024 x 768పిక్సల్స్, అలానే 212 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ, వేగవంతమైన ప్రాసెసర్, నాణ్యమైన టచ్‌సెన్సిటివిటీ. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే... డ్యుయల్ వై-ఫై బీ/జీ/ఎన్ సపోర్ట్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ (1000 ఇ-పుస్తకాలను దాసుకోవచ్చు).

ఈ సరికొత్త ఇ-రీడర్లలో  ‘కైండిల్ పేజ్ ఫ్లిఫ్‌ ఇన్-లైన్ ఫుట్ నోట్స్', ‘ఫ్రీ టైమ్', ‘వొకాబులరీ బిల్డర్', ‘న్యూ స్మార్ట్ లుకప్' వంటి ఆధునిక ఫీచర్లను  ఏర్పాటు చేసారు.  అలానే, ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్వెబ్‌సైట్‌లకు అనుసంధానం కావచ్చు. ఈ సరికొత్త కైండిల్ ఇ-బుక్ రీడర్ బరువు 206 గ్రాములు. సింగిల్ బ్యాటరీ చార్జ్ పై 8 వారాల బ్యాకప్‌ను పొందవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot