హాయ్.. నేనొస్తున్నా..!!

Posted By: Staff

హాయ్.. నేనొస్తున్నా..!!

అవును మీరు వింటున్నది నిజమే... ప్రపంచాన్ని టెక్నాలజి శాసిస్తున్న రోజులివి.. టెక్నాలజి పై ఆధారపడి మనిషి జీవనం సాగిస్తున్న రోజులవి.. నిత్యవసరాల్లో ఒకటైన టెక్నాలజి మనిషిని శాసించే స్థాయికి ఎదిగింది.

ప్రతిపనిలోనూ కంప్యూటర్ ను వినియోగిస్తున్న కాలమిది.. తొలినాళ్లలో టన్నల బరువుతో రూపుదిద్దకున్న కంప్యూటర్ క్రమంగా ఆధునికతను సంతరించుకుని 100 గ్రాముల బరువుతో అరచేతిలో అమరే విధంగా టాబ్లెట్ స్థాయికి చేరింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ‘టాబ్లెట్ పీసీల’ హవా కొనసాగుతుంది.

ప్రపంచ ఆనలైన్ మార్కెట్లో అదిపెద్ద రిటైల్ అమ్మకందారైన ‘Amazon’ సంస్థ Tablet manufacturing segmentలోకి అడుగుపెట్టనుంది. తాజా ఈ సంస్థ చేసిన ఓ ప్రకటనలో ‘Amazon’s new 7 Inch Tablet’ ను మార్కెట్లో విడుదల చేయునున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కొత్త టాబ్లెట్ భారతీయ మార్కెట్లో మంచి హిట్ కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘Android’ ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్న ఈ టాబ్లెట్ పీసీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టాబ్లెట్ తయారీలో భాగంగా Taiwane company అయిన christened Quantaతో ‘Amazon’ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియవచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా ‘Quanta’ కంపెనీ నెలకు మిలియన్ల సంఖ్యంలో టాబ్లెట్లను తయారు చేసి ‘Amazon’ సంస్థకు అందించనున్నట్లు తెలిసింది.

భారీ అంచనాలతో 2011 చివరిలో మార్కెట్లోకి అందుబాటులోని రానున్న ‘Amazon Tablet ’ సమంజసమైన ధరలతో అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని విశ్లేషక వర్గాలు పేర్కొంటున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting