అమెజాన్ టాబ్లెట్‌ల కొనుగోలు పై భారీ క్రిస్టమస్ రాయితీలు.. త్వరపడండి!

Posted By:

 అమెజాన్ టాబ్లెట్‌ల కొనుగోలు పై భారీ క్రిస్టమస్ రాయితీలు.. త్వరపడండి!

క్రిస్టమస్ పండుగ సమీపిస్తున్న నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ ఇంకా టాబ్లెట్ పీసీల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ కంపెనీ అమెజాన్, ఇండియాలో తన కిండిల్‌ఫైర్ టాబ్లెట్ ఉత్పత్తులకు సంబంధించి భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రత్యేక రాయితీలను కిండిల్ ఇ-రీడర్, కిండిల్ ఫైర్ హైడెఫినషన్ టాబ్లెట్ పీసీలతో పాటు కిండిల్ పేపర్ వైట్ టాబ్లెట్ కొనుగోళ్ల పై వినియోగదారులు పొందవచ్చు. క్రిస్టమస్ కానుకుగా కిండిల్ శ్రేణి టాబ్లెట్ పీసీల కొనుగోళ్ల పై అమెజాన్ అందిస్తోన్న రాయితీలను పరిశీలించినట్లయితే...

ధర రాయితీలో భాగంగా రూ.5,999 విలువ చేసే కిండిల్ ఇ-రీడర్ డివైజ్‌ను రూ.వెయ్యి తగ్గింపుతో కేవలం రూ.4,999కి అమెజాన్ ఆఫర్ చేస్తోంది.

క్రిస్టమస్ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.10,999 విలువ చేసే కిండిల్ పేపర్ వైట్ (వై-ఫై వర్షన్) టాబ్లెట్‌ను రూ. వెయ్యి తగ్గింపుతో రూ.9,999కి అమెజాన్ ఆఫర్ చేస్తోంది.

క్రిస్టమస్ కానుకగా రూ.15,999 విలువ చేసే కిండిల్ ఫైర్ హైడెఫినిషన్ టాబ్లెట్‌ను రూ.4,000 తగ్గింపుతో రూ.11,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది.

ఇదే సమయంలో 16జీబి, 32జీబి వర్షన్ కిండిల్ ఫైర్ హైడెఫినిషన్ 8.9టాబ్లెట్ పీసీలను రూ.18,000, రూ.22,000కు సొంతం చేసుకునేఅవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot