Home
Computer

అమెజాన్ ల్యాప్‌టాప్ సేల్.. టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్స్‌ ఇప్పుడు ఇంత తక్కువ ధరకే లభిస్తున్నాయంటే వెంటనే కొనేస్తా

Amazon Sale: అమెజాన్ ల్యాప్‌టాప్ డేస్‌లో టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై 43% వరకు భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. లెనోవో, ఏసర్, అసుస్, హెచ్‌పీ, డెల్ ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు చవకగా లభిస్తున్నాయి. వర్క్, గేమింగ్, ఎంటర్టైన్‌మెంట్ అన్ని అవసరాలను హ్యాండిల్ చేయగల మంచి ప్రాసెసర్‌లు, డిస్‌ప్లేలు, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, లైట్‌వెయిట్ డిజైన్, అడ్వాన్స్‌డ్ కూలింగ్‌తో ప్రొఫెషనల్స్‌కి, స్టూడెంట్స్‌కి ఈ ల్యాప్‌టాప్‌లు మంచి ఛాయిస్.

* ఏసర్ ఆస్పైర్ లైట్

ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్ AMD రైజెన్ ప్రాసెసర్‌తో వస్తోంది, ఈ సేల్‌లో ఇది ఒక సూపర్ డీల్ అనే చెప్పాలి. ఇది 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్‌తో వస్తుంది, దీని వల్ల మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. 15.6- అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే క్లియర్ విజువల్స్‌ని అందిస్తుంది.

Amazon Sale is Live now Get a Top Branded laptops for low prices

అంతేకాదు ఇది లైట్‌వెయిట్ మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఈ ల్యాప్‌టాప్ వర్క్, ఎంటర్టైన్‌మెంట్, ఇంకా రోజువారీ పనులకు బాగా సరిపోతుంది. HD ఆడియో, లైట్‌వెయిట్, న్యూమరిక్ కీప్యాడ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ దీని ప్రత్యేకతలు.

* అసుస్ వివోబుక్ 15

అసుస్ వివోబుక్ 15 కూడా ఒక సూపర్ ఆప్షన్. ఇది 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో వస్తుంది, యాంటీ-గ్లేర్ కోటింగ్ ఉండటం వల్ల స్క్రీన్ మీద లైట్ పడినా క్లియర్‌గా కనిపిస్తుంది. రెస్పాన్సివ్ సిస్టమ్, మంచి స్టోరేజ్‌తో రోజువారీ పనులను చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

ఇందులో విండోస్ 11, ఆఫీస్ 2021తో ప్రీ-ఇన్‌స్టాల్ అయి వస్తాయి. వర్క్, స్టడీస్ కోసం ఇది మంచి ఛాయిస్. ఇంకా దీన్ని మీరు నో కాస్ట్ EMI ఆప్షన్‌లో కూడా కొనుక్కోవచ్చు. బ్యాక్‌లిట్ కీబోర్డ్, యాంటీ-గ్లేర్ కోటింగ్, ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, LCD డిస్‌ప్లే దీనిలోని ప్రత్యేకతలు.

* లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్‌

AMD రైజెన్ 5 5500U ప్రాసెసర్‌తో వస్తున్న లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది, ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్‌కి ఇది బాగా సరిపోతుంది. ఇందులో విండోస్ 11, MS ఆఫీస్ 2021 ప్రీ-ఇన్‌స్టాల్ అయి వస్తాయి.

అందుకే వర్క్ చేసుకునేవారు, చదువుకునే వారికి ఇది బెస్ట్ ల్యాప్‌టాప్. దీంతో చాలా ప్రొడక్టివ్‌గా మన పనులు పూర్తి చేసుకోవచ్చు. 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, యాంటీ-గ్లేర్ కోటింగ్ ఫీచర్ LED డిస్‌ప్లే ఇందులో చెప్పుకోదగిన ఫీచర్లు. అమెజాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి ధర చెక్ చేయొచ్చు.

* లెనోవో ఐడియాప్యాడ్ ప్రో 5

లెనోవో ఐడియాప్యాడ్ ప్రో 5 ఇంటెల్ ఎవో కోర్ అల్ట్రా 9 185H ప్రాసెసర్‌తో రన్ అవుతుంది, హెవీ టాస్క్‌ల కోసం ఇది బెస్ట్ ఆప్షన్. దీని 14-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో క్రిస్ప్ విజువల్స్‌ని అందిస్తుంది. 32GB ర్యామ్, 1TB SSDతో మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాలా కాలం పాటు ఏమీ డిలీట్ చేయకుండా వాడుకోవచ్చు. దీని రిజల్యూషన్ 2880 x 1800 పిక్సెల్స్. మెమరీ స్పీడ్ 7467 MHz. HD ఆడియో దీనిలోని ప్రత్యేకత. అమెజాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి ధర చెక్ చేయొచ్చు.

* హెచ్‌పీ పెవిలియన్ 14

హెచ్‌పీ పెవిలియన్ 14 12th జెన్ ఇంటెల్ కోర్ i7-1255U ప్రాసెసర్‌తో వస్తుంది, వర్క్, ఎంటర్టైన్‌మెంట్ కోసం స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. దీని 14-అంగుళాల FHD మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లే షార్ప్ విజువల్స్‌ని అందిస్తుంది. 16GB ర్యామ్, 1TB SSD మల్టీ టాస్కింగ్‌ని ఈజీగా హ్యాండిల్ చేస్తాయి.

బిల్ట్-ఇన్ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ డిస్‌ప్లే క్వాలిటీని పెంచుతాయి, ఇది ఒక బెస్ట్ ఆల్-రౌండర్ ల్యాప్‌టాప్. నేచురల్ సిల్వర్, బిల్ట్-ఇన్ అలెక్సా, 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, LED డిస్‌ప్లే ఇందులోని ముఖ్య ఫీచర్లు.

అమెజాన్‌లో దీనిపై ఉన్న ఆఫర్స్ చెక్ చేయవచ్చు.

* అసుస్ జెన్‌బుక్ 14

ఇది ప్రీమియం ల్యాప్‌టాప్ కావాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్. 14-అంగుళాల 3K OLED టచ్‌స్క్రీన్‌తో వస్తుంది, షార్ప్ విజువల్స్‌తో పాటు టచ్ ఇంటరాక్షన్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అధిక బ్యాటరీ బ్యాకప్ ఉండటం వల్ల చాలా సేపు వాడుకోవచ్చు.

లైట్‌వెయిట్ డిజైన్ వల్ల ట్రావెల్ చేసేవాళ్లకి ఇది పర్ఫెక్ట్ ల్యాప్‌టాప్. థండర్‌బోల్ట్ పోర్ట్, 70% లెస్ హార్మ్‌ఫుల్ బ్లూ లైట్, టచ్‌స్క్రీన్, OLED డిస్‌ప్లే, 75WHrs, 2S2P, 4-సెల్ Li-ion బ్యాటరీ దీనిలో చెప్పుకోదగిన ఫీచర్లు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon's big laptop sale brings great deals on top brands like Lenovo, Acer, ASUS, and HP. Get high-performance laptops for work, gaming, or studies with advanced features and smooth performance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X