మినీ ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్.. కేవలం 5,499కే!

Posted By: Prashanth

మినీ ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్.. కేవలం 5,499కే!

 

ప్రముఖ దేశీయరంగ ఉపకరణాల తయారీ సంస్థ ‘యాంబ్రేన్’(Ambrane) సరికొత్త ఆండ్రాయిడ్ మినీ ల్యాప్‌టాప్‌ను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా స్పందించే ‘యాంబ్రేన్ మినీ’ ధర రూ.5,499. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ ఈ డివైజ్‌ను ఆఫర్ చేస్తోంది. పోర్టబుల్ కంప్యూటింగ్‌ను కోరుకునే వారికి ఈ మినీ ల్యాప్‌టాప్ ఉత్తమ ఎంపిక.

కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

బుల్ట్‌ఇన్ 0.3 కెమెరా,

యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

వై-ఫై కనెక్టువిటీ,

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

తగ్గింపు ధరల్లో సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 (7.0): టాప్-3 ఆన్‌లైన్ డీల్స్

వాయిస్ కాలింగ్ ఫీచర్‌తో కూడిన అత్యుత్తమ టాబ్లెట్ పీసీ కోసం చూస్తున్నారా..? మీ కోసం సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 (7.0) సిద్ధంగా ఉంది. ఈ డివైజ్ కొనుగోలు ప్రత్యేక రాయితీలను మీరు పొందవచ్చు. తగ్గింపు ధరల్లో భాగంగా ట్రేడస్ డాట్ కామ్ (Tradus.com)గెలాక్సీ టాబ్ 2 (7.0)ను రూ.18,690 ధరకు ఆఫర్ చేస్తోంది. మరిన్నిఆన్‌లైన్ డీల్స్ చూసే ముందు సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 (7.0) స్పెసిఫికేషన్‌లు…..

7 అంగుళాల పీఎల్ఎస్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ 4.1జెల్లీబీన్),

3మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,

ఇంటర్నల్ మెమరీ 8జీబి/16జీబి,

1జీబి ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (20 గంటల టాక్‌టైమ్, 800 గంటల స్టాండ్‌బై టైమ్),

ప్రీలోడెడ్ ఫీచర్లు: జీమెయిల్, యూట్యూబ్, సింక్ విత్ గూగుల్ క్యాలెండర్, గూగుల్ సెర్చ్, గూగుల్+, గ్లోనాస్, సామ్‌సంగ్ హబ్, రీడర్ హబ్, గేమ్ హబ్, సామ్‌సంగ్ చాట్ ఆన్, సామ్‌సంగ్ కైస్, మై రీడర్.

గెలాక్సీ టాబ్ 2 పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్:

- సులేఖా డాట్ కామ్ ఈ టాబ్లెట్‌ను రూ.17,999కి ఆఫర్ చేస్తుంది. ఫ్రీ షిప్పింగ్ ఇంకా నెలసరి వాయిదాల చెల్లింపు,

- ఇన్ఫీబీమ్ డాట్ కామ్ ఈ టాబ్లెట్‌ను రూ.18,335కి ఆఫర్ చేస్తోంది. 30 రోజుల రీప్లేస్ మెంట్ వారంటీ, ఫ్రీషిప్టింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, నెలసరి వాయిదా చెల్లింపు,

- మానియాక్ స్టోర్ డాట్ కామ్ ఈ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను రూ.18,490కి ఆఫర్ చేస్తోంది. నెట్ బ్యాకింగ్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, నెలసరి వాయిదా చెల్లింపు ఆఫర్‌లను ఈ రిటైలర్ కల్పిస్తుంది.

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot