కన్‌ఫ్యూషన్ ఎందుకు ‘ఫ్యూషన్’ ఉండగా..!!

సాంకేతిక పరికరాల తయారీలో ప్రఖ్యాతి గాంచిన తోషిబా, లెనివోలు ఈ ఏఎమ్‌డి లయనో (A సరీస్) వ్యవస్థతో కూడిన ల్యాప్‌టాప్‌లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టారు. అయతే తొలిత ఈ బ్రాండ్లు ‘ఏఎమ్‌డి చిప్ వ్యవస్థ’ను నోట్‌బుక్‌లలో ప్రవేశ పెట్టి, ఈ ఏడాది మొదట్లోనే పలు దేశాల్లో విడుదల చేశారు. అయితే వీటి అమ్మకాలు ఇప్పటికి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నోట్ బుక్ ధరలను పరిశీలిస్తే రూ.18,000 నుంచి ప్రారంభమవుతున్నాయి.
అయితే తోషిబా (Toshiba) వారం క్రిందట మూడు సరికొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలు రూ.24,750 నుంచి మొదలవుతున్నాయి. ఈ మోడళ్లలో ప్రధానమైన ‘L775D-S7226’ మెడల్ అడ్వాన్స్‌డ్ వర్షన్‌తో రూపుదిద్దుకుంది. అయితే దీని ధర మార్కెట్లో రూ.27,000 ఉంది. మరో బ్రాండ్ లెనివో (Lenovo), రెండు సరికొత్త నోట్‌బుక్‌లను మార్కెట్లో విడుదల చేసింది. 15.6, 14 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్‌లు ధరలు రూ. 24,750 నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటిలో పొందుపరిచిన ‘ఏఎమ్‌డి ఫ్యూషన్ చిప్’ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటంతో పాటు తక్కువ విద్యుత్‌ని ఖర్చు చేస్తుంది.


Click it and Unblock the Notifications








