‘ఆమోజన్ కిండిల్ ఫైర్’ ఇప్పుడు కొత్త తరహాలో!!

Posted By: Staff

‘ఆమోజన్ కిండిల్ ఫైర్’ ఇప్పుడు కొత్త తరహాలో!!
టాబ్లెట్ పీసీల పరిశ్రమలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ‘ఆమోజన్ కిండిల్ ఫైర్’ (Amazon Kindle Fire) ఆండ్రాయిడ్ గేమింగ్ ఆడ్వాన్సడ్ అప్లికేషన్లతో  వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది.

‘ఆమోజన్ కిండిల్ ఫైర్’ తాజా వర్షన్ టాబ్లెట్ పీసీలోని  ఫీచర్లను పరిశీలిస్తే వేలాది ఆండ్రాయిడ్  గేమింగ్ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యతను కల్పించారు. అదే విధంగా

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషెల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్లను సునాయాశంగా ఆపరేట్ చేసుకోవచ్చు. పీసీలో పొందుపరిచిన ‘ఆమోజన్ ఒన్ క్లిక్ పేమెంట్’ ఫీచర్  సౌలభ్యతతో వివిధ రకాల గ్యేమ్‌లతో పాటు  సోషెల్ నెట్‌వర్కింగ్  అప్లికేషన్లను వేగవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీ  అందిస్తున్న ఆధునిక సౌలభ్యతతో EA, Zynga, Gameloft వంటి  అంతర్జాతీయ గ్యేమింగ్ అప్లికేషన్లతో మీరు డైరెక్టుగా కనెక్టు కావచ్చు.

మరో ఆధునిక అప్లికేషన్ ‘నెట్ ఫ్లిక్స్’ను డౌన్ చేసుకోవడం వల్ల వేలకొలది వీడియోలను, టీవీ షోలను అంతరాయం లేకుండా తిలకించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot