శ్యామ్‌సంగ్ గెలక్సీ తాజా అప్‌డేట్!!

Posted By: Staff

శ్యామ్‌సంగ్ గెలక్సీ తాజా అప్‌డేట్!!

 

దిగ్గజ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు శ్యామ్‌సంగ్  ‘గెలక్సీ ట్యాబ్ 10.1’ను అప్‌డేట్ చేసే యోచనకు శ్రీకారం చుట్టుంది. ఇప్పటికే మార్కెట్ విడుదలై గణనీయంగా అమ్ముడవుతున్న ఈ వర్షన్ టాబ్లెట్ పీసీలు ఆండ్రాయిడ్ 3.1 హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై రన్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ టాబ్లెట్ పీసీని మరింత అప్‌డేట్ చూస్తూ శ్యామ్‌సంగ్ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.1 ఆపరేటింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక వర్షన్ 3.2 ఆండ్రాయిడ్ హనీకూంబ్ వ్యవస్థను రిక్రూట్ చేసింది. ఈ మార్పు తమకు మరింత లబ్ధి చేసే అంశమని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

క్లుప్తంగా ఆధునిక వర్షన్ ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్10.1 ట్యాబ్’ ఫీచర్లు:

- ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

- టీఎఫ్టీ స్వభావం కలిగిన 10.1 అంగుళాల స్క్రీన్,

- హై డెఫినిషన్ డిస్ ప్లే,

- డ్యూయల్ కోర్ 1GHz ARM Cortex-A9 ప్రాసెసర్,

-  జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

- ఇంటర్నెల్ మెమరీకి సంబంధించి 16GB, 32GB, 64 GB వర్షన్లలో ఈ గ్యాడ్జెట్ లభ్యమవుతుంది.

- రేర్ కెమెరా 3 మెగా పిక్సల్, ఫ్రంట్ కెమెరా 2 మెగా పిక్సల్,

- కనెక్టువిటీ అంశాలను  మరింత పటిష్టితం చేస్తూ  పొందుపరిచిన  బ్లూటూత్,  వై-ఫై వ్యవస్థను వినియోగదారుడికి మరంత లబ్ధి చేకూరుస్తాయి.

- శ్యామ్‌సంగ్ గెలక్సీ 10.1 టాబ్లెట్ పీసీ మార్కెట్ ధర రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot