ఇక కంప్యూటర్ నుంచైనా ఆండ్రాయిడ్ ఫోన్ మెసేజ్‌లను పంపుకోవచ్చు
డెస్క్‌టాప్ కంప్యూటర్‌లలో ఆండ్రాయిడ్ మెసేజింగ్‌ను మరింత సులభతరం చేస్తూ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది.
డెస్క్‌టాప్ కంప్యూటర్‌లలో ఆండ్రాయిడ్ మెసేజింగ్‌ను మరింత సులభతరం చేస్తూ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. మెసేజెన్ ఫర్ వెబ్ (Messages for Web) పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మెసేజెస్ ఫర్ వెబ్ అనేది ఆండ్రాయిడ్ మెసేజెస్ అప్లికేషన్‌లో ఓ ఆప్షన్ క్రింద అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు తమ డెస్క్‌టాప్ కంప్యూటర్ నుంచే ఎస్ఎంఎస్ అలానే చాట్ మెసేజ్‌లను సెండ్ అలానే రిసీవ్ చేసుకునే వీలుంటుంది. యాపిల్ iMessage సర్వీసుకు పోటీగా గూగుల్ ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

గూగుల్ బ్లాగ్ పోస్ట్ రివీల్ చేసిన వివరాల ప్రకారం...
గూగుల్ బ్లాగ్ పోస్ట్ రివీల్ చేసిన వివరాల ప్రకారం ఈ వెబ్ వెర్షన్ టూల్ టెక్స్ట్, ఇమెజెస్ అలానే స్టిక్కర్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. చాటింగ్‌కు అనుకూలమైన రిచ్ కమ్యూనికేషన్ సర్వీసును కూడా ఇందులో యాడ్ చేయటంతో వాట్సాప్ అలానే ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లకు సంబంధించిన డెస్క్‌టాప్ వెర్షన్స్‌తో ఆండ్రాయిడ్ మెసేజెస్ పోటీ పడగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవల్సి ఉంటుంది...
ఈ కొత్త ఫీచర్‌ను మీరు కూడా వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లయితే ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ మెసేజెస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ పూర్తయిన తరువాత మీ కంప్యూటర్‌లోకి వెళ్లి ఆండ్రాయిడ్ మెసేజెస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ అయిన తరువాత మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఆండ్రాయిడ్ మెసేజెస్ యాప్‌ను ఉపయోగించుకుని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఇంకా లైవ్‌లోకి రాలేదు...
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేందుకు ముందుగా మీ ఫోన్‌లోని మెసేజెస్ యాప్‌లోకి వెళ్లి టాప్-రైట్ కార్నర్‌లో కనిపించే మెనూ (మూడు డాట్ల) ఐకాన్ పై క్లిక్ చేయండి. మెనూలోకి వెళ్లిన తరువాత Messages for Web అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఇంకా లైవ్‌లోకి రాలేదు. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి ప్రముఖ బ్రౌజర్‌లను మెసేజెస్ ఫర్ వెబ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని గూగుల్ తెలిపింది.

GIF ఫైల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది..
ఆండ్రాయిడ్ మెసేజెస్ యాప్‌కు సంబంధించి మరో నాలుగు కొత్త ఫీచర్లను కూడా గూగుల్ అనౌన్స్ చేసింది. కొత్త యాడ్ అయిన ఫీచర్‌లో భాగంగా మెసేజెస్ యాప్ GIF ఫైల్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ మెసేజెస్ యాప్‌లో కావల్సిన విధంగా GIF ఫైల్స్‌ను సెర్చ్ చేసుకుని వాటిని కావల్సిన వ్యక్తులకు సెండ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో యాడ్ అయిన మరో ఫీచర్ పేరు Smart reply. ఈ ఫీచర్ ఇన్‌కమ్మింగ్ టెక్స్ట్ మెసేజ్‌లకు సంబంధించి టెక్స్ట్ లేదా ఎమోజీలను సజెస్ట్ చేస్తుంది. నూతనంగా యాడ్ అయిన మరో ఫీచర్‌లో భాగంగా పాస్‌వర్డ్స్ అలానే వెరిఫికేషన్ కోడ్‌లను చాలా సలువుగా కాపీ అలానే పేస్ట్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications