భారత్‌లోకి ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీలు

Posted By:

భారత్‌లో అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కు కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను తయారీ చేసే అనేక కంపెనీలు ఆండ్రాయిడ్ ఆధారిత ఉత్పత్తుల రూపకల్పన పై దృష్టిసారిస్తున్నాయి.

 భారత్‌లోకి  ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీలు

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీదారు అరైస్ ఇండియా (Arise India) ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 ఆపరేటింగ్ సిస్టం పై నడిచే కొత్త శ్రేణి ఎల్ఈడి టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్‌ల పై ఈ టీవీలు రన్ అవుతాయి. ఈ ఎల్ఈడి టీవీల ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

‘అరైస్ ఎల్ఈడి టవీ ఫర్ ఆండ్రాయిడ్' ('Arise LED TV For Android') శ్రేణి నుంచి విడుదలైన ఈ కొత్తరకం ఎల్ఈడీ టీవీల ధరలు రకాన్ని బట్టి రూ.35,000 నుంచి రూ. 2 లక్షల వరకు ఉన్నాయి. 32  అంగుళాల స్ర్కీన్ వేరింయట్ నుంచి 84 అంగుళాల స్ర్కీన్ వేరియంట్ వరకు వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో ఈ టీవీలను అందుబాటులో ఉంచారు. ఈ కొత్త టీవీలకు ప్రచారకర్తగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను కంపెనీ ఎంపిక చేసుకుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting