నిన్న ‘ఆకాష్’.. నేడు ‘క్లాస్ ప్యాడ్’!!

Posted By: Super

నిన్న ‘ఆకాష్’.. నేడు ‘క్లాస్ ప్యాడ్’!!

 

ప్రపంచపు అతి తక్కువ ధర కలిగిన టాబ్లెట్ పీసీగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆకాష్’ దేశంలోని అనేక స్కూళ్లలో సబ్సిడీ ధరకే లభ్యమవుతోంది. రూ.1500 చెల్లించి ఈ టాబ్లెట్‌ను విద్యార్థులు సొంతం చేసుకుంటున్నారు. టాబ్లెట్ టచ్ స్ర్కీన్ క్వాలిటీ విషయంలో చెడు వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పటికి పనితీరులో నెం.1 అని విశ్లేషణలు చెబుతున్నాయి.

ఆకాష్ తరహాలో మరో దేశీయ టాబ్లెట్ రూపుదిద్దుకుంది. ఢిల్లీకి చెందిన ఓ ఎడ్యూకేషన్ సొల్యూషన్ సంస్థ, క్లాస్ రీడర్ లెర్నింగ్ సిస్టంలను డిజైన్ చేసింది. ‘క్లాస్‌ప్యాడ్’గా పిలవబడుతున్న ఈ టాబ్లెట్‌ను ప్రత్యేకించి విద్యార్థుల కోసం రూపొందించారు. ఆకాష్‌తో పోలిస్తే ఎక్కువ ధరే అయినప్పటికి ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంటుంది.

క్లాస్‌ప్యాడ్ 7, క్లాస్‌ప్యాడ్ 8, క్లాస్‌ప్యాడ్ 10 మోడల్స్‌లో ఈ టాబ్లెట్‌లు లభ్యమవుతున్నాయి. ప్రత్యేకంగా 3వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం డిజైన్ చేశారు. విద్యార్ధి తన అవసరాలను బట్టి మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. క్లాస్‌ప్యాడ్ ప్రారంభ మోడల్ ధర రూ.7,500 కాగా టాప్ మోడల్ ధర రూ. 14,000.

టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టం,

* శక్తివంతమైన టచ్ స్ర్కీన్,

* 1.3 GHz ప్రాసెసర్,

* ఇంటర్నల్ మెమరీ 4ఎంబీ,

* ఎక్స్ ప్యాండబుల్ మెమరీ 8జీబి వరకు,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot