యాపిల్ ఐప్యాడ్ ‘128జీబి వర్షన్’ అధికారిక ప్రకటన!

Posted By:

 యాపిల్ ఐప్యాడ్ ‘128జీబి వర్షన్’ అధికారిక ప్రకటన!
128జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్‌తో కూడిన ‘ఐప్యాడ్4 రెటీనా డిస్‌ప్లే' ట్యాబ్లెట్ వేరియంట్‌ను టెక్ టైటాన్ యాపిల్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థలు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ షిల్లర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన 120 మిలియన్‌ల ఐప్యాడ్ విక్రయాలు బ్రాండ్ విశిష్టతను చాటుతున్నాయని అన్నారు. తాము ప్రవేశపెట్టిన 128జీబి ఐప్యాడ్ వేరియంట్ స్టోరేజ్ వ్యవస్థను రెట్టింపు చేయటంతో పాటు వ్యక్తిగత కంప్యూటింగ్ అలానే బిజినెస్ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుందని షిల్లర్ ధృడనిశ్చయాన్ని వ్యక్తం చేశారు.

128జీబి ఐప్యాడ్ ఏఏ వేరియంట్‌లలో లభ్యమవుతోంది..?

వై-ఫై, వై-ఫై+సెల్యులార్ వర్షన్‌లలో 128జీబి ఐప్యాడ్4ను విక్రయించనున్నారు. వై-ఫై వర్షన్ ధర $799 (విశ్వసనీయ వర్గాల సమాచారం), వై-ఫై+సెల్యులార్ వర్షన్ ధర $929 (విశ్వసనీయ వర్గాల సమాచారం). ఈ భారీ స్టోరేజ్ పోర్టబుల్ కంప్యూటింగ్
డివైజ్‌ను ఫిబ్రవరి 5నుంచి యూఎస్ మార్కెట్లో విక్రయించనున్నారు.

ఇండియా ధర ఎంత..?

ఇండియన్ రిటైల్ మార్కెట్లో 128జీబి ఐప్యాడ్4 వై-ఫై వర్షన్ ధర రూ.49,900. వై-ఫై+సెల్యులార్ వర్షన్ ధర వ్యాట్‌తో కలుపుకుని రూ.56,900.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting