ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నుంచి మరో సోషల్‌మీడియా పోస్ట్.. ఈసారి ఏం విడుదల చేయనున్నారో..!
ఆపిల్ (Apple) నుంచి ఇటీవల ఐఫోన్ 16e విడుదల అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది. ఐఫోన్ SE నెక్ట్ జెన్ హ్యాండ్‌సెట్ ను విడుదల చేస్తుందని అంతా భావించారు. అయితే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఐఫోన్ 16e మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ విడుదల కంటే ముందే ఆపిల్ సీఈవో టిక్ కుక్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ఆపిల్ కుటుంబం లోనికి కొత్త సభ్యులు వస్తున్నారని ట్వీట్ చేశారు. అందుకు అనుగుణంగా కొత్త ఐఫోన్ మోడల్‌ను లాంచ్ చేసింది.
తాజాగా టిమ్ కుక్ (Apple CEO Tim Cook) అదే తరహాలో మరో హింట్ ఇచ్చారు. This week అనే క్యాప్షన్‌తో Air పేరుతో ఉన్న టీజర్‌ను షేర్ చేశారు. దీని ఆధారంగా ఈ వారంలో ఆపిల్ నుంచి మరో డివైజ్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా M4 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ M4? :
అనలిస్ట్ మార్క్ గుర్మన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. MacBook Air M4 ఈ నెలలో విడుదల కానుందని అంచనా వేశారు. గత సంవత్సరం లాంచ్ అయిన మ్యాక్‌బుక్ ఎయిర్ M3 కంటే అనేక అప్‌గ్రేడ్స్‌తో ఆపిల్ కొత్త ల్యాప్‌టాప్ లాంచ్ కానుంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఏ తేదీన విడుదల కానుందనే కచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. దీంతోపాటు ఎలాంటి ఫీచర్ లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందనే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే ఈ ల్యాప్‌టాప్ గురించి కొన్ని లీక్స్ వచ్చాయి.
This week. pic.twitter.com/uXqQaGNkSk
— Tim Cook (@tim_cook) March 3, 2025
మ్యాక్‌బుక్ ఎయిర్ M4.. 13 అంగుళాలు, 15 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. M4 చిప్‌సెట్ కారణంగా పనితీరు మెరుగుపడుతుంది. దీంతోపాటు 16GB ర్యామ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 4 థండర్‌బోల్ట్ పోర్ట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.
కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిక్ 12MP వెబ్‌క్యామ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వీటితోపాటు ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ కొత్త ధరల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్‌తోపాటు ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌ను కూడా ఆపిల్ అభివృద్ధి చేస్తోందని సమాచారం.
మార్క్ గుర్మన్ వివరాల ఆధారంగా ఐప్యాడ్ ఎయిర్ మరియు ఐప్యాడ్ 11 మోడల్స్ ఈ సంవత్సరం మధ్య భాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐప్యాడ్ ఎయిర్ M3 లేదా M4 చిప్‌సెట్ తో విడుదల కానుందని తెలుస్తోంది. అదే ఐప్యాడ్ 11 మాత్రం A16 బయోనిక్ లేదా A17 ప్రో చిప్ తో పనిచేసే అవకాశం ఉంది.
* ఇటీవల భారత్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 16e 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59900 గా ఉంది. 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69900, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89900 గా ఉంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఐఫోన్ 3nm A18 చిప్‌సెట్, iOS 18 తో పనిచేస్తోంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. OIS సపోర్టుతో 48MP కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








