‘ఆపిల్ ఐపాడ్ -2’ శకం ముగియనుందా...?

Posted By: Super

‘ఆపిల్ ఐపాడ్ -2’ శకం ముగియనుందా...?


‘‘ప్రపంచ కంప్యూటింగ్ వ్యవస్థలో ప్రభంజనం సృష్టించిన దిగ్గజ ‘ఆపిల్ ఐపాడ్ -2’ శకం ముగియనుందా..? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈ వార్త పలువురుకు మింగుడు పడనప్పటికి, ఇప్పుడు వినబోయే తీపి కబురు ‘ఆపిల్’ ప్రేమికుల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘ఆపిల్ ఐప్యాడ్ -3’ త్వరలో వినియోగదారుల ముందుకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఆపిల్ -3’లో ప్రేవేశపెడుతున్న అత్యాధునిక నాణ్యత కలిగిన బ్యాటరీ వ్యవస్థు దీర్ఘకాలిక మన్నికను వినియోగదారుడుకు అందిస్తుండట’’..

ఐపాడ్ -3 ఫీచర్లు:
- సరికొత్త రెటినా డిస్‌ప్లే ఫీచర్‌ను ఐప్యాడ్ -3లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
- ఐప్యాడ్ -1, ఐప్యాడ్ -2 మోడళ్లలోని మెమరీ సమస్యను సవరిస్తూ విడుదల కాబోతున్న ఐప్యాడ్ - 3లో 64జీబీ మెమరీ సామర్ధ్యాన్ని పొందుపరిచినట్లు తెలుస్తోంది.
- భారీ అంచనాలతో మధ్య రూపుదిద్దుకుంటున్న ఐప్యాడ్ -3, ధర రూ.40,000తో వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
- హెచ్డీఎమ్ఐ వ్యవస్థకు సంబంధించి ‘ఐపాడ్ - 2’లో లోపించిన ‘ఏవి ఆడాప్టర్’ పరికరాన్ని రూ.2000 ధరతో ఆపిల్ మార్కెట్లో విడుదల చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot