స్టీవ్ జాబ్స్ సాక్షిగా ‘ఆపిల్ అద్భుతం 2012’..?

Posted By: Super

స్టీవ్ జాబ్స్ సాక్షిగా ‘ఆపిల్ అద్భుతం 2012’..?


‘‘సాంకేతిక దిగ్గజం ‘ఆపిల్’ గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే.. టెక్నాలజీ చరిత్రలో సాటి మేటిగా దూసుకుపోతున్న ఈ ప్రపంచ శ్రేణి సంస్థకు వెన్నుముకైన ‘స్టీవ్ జాబ్స్’(ఆపిల్ కో-ఫౌండర్) కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్త ఆపిల్ అభిమానుల్లో విషాదాన్ని నింపిన ఈ ఘటన ఆపిల్ పై సానుభూతిని మరింత పెంచింది.’’

‘2012’లో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ఆపిల్ సన్నద్ధమవుతుంది. కేవలం రూ.8,500కే అత్యాధునిక టాబ్లెట్ పీసీని విడుదల చేయుబోతుంది. ‘ఆపిల్ ఐప్యాడ్ మినీ’(Apple ipad mini) వర్షన్లో డిజైన్ కాబడ్డ ఈ గ్యాడ్జెట్ ‘ఆమోజోన్ కిండిల్ ఫైర్’మరియు ‘శ్యామ్ సంగ్ గెలక్సీ’లకు పోటీగా నిలవనుందని విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి.

క్లుప్తంగా ‘ఆపిల్ ఐప్యాడ్ మినీ’ ఫీచర్లను పరిశీలిస్తే..

- అత్యాధునిక ఐవోస్ ( iOS) 4.3 ఆపరేటింగ్ వ్యవస్థను టాబ్లెట్లో లోడ్ చేశారు.

- శక్తివంతమైన 1GHz డ్యూయల్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను గ్యాడ్జెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

- వేగవంతమైన 9X గ్రాఫిక్ టెక్నాలజీ వ్యవస్థను పీసీలో ఏర్పాటు చేశారు.

-5X డిజిటల్ జూమ్ సామర్ధ్యం కలిగిన కెమెరా ముందు, వెునుక భాగాల్లో అమర్చారు.

- టాబ్లెట్లో పొందుపరిచిన వై-ఫై, బ్లూటూత్ వంటి కనెక్టువిటీ వ్యవస్థలు డేటాను వేగంవతంగా ట్రాన్సఫర్ చేస్తాయి.

- ఫింగర్ ఫ్రింట్ రెసిస్టెంట్ ఫీచర్ తో పాటు వివిధ సెక్యూరిటీ ఫీచర్లను పీసీలో పొందుపరిచారు.

-16జీబీ, 32జీబీ వేరియంట్లలో ఈ గ్యాడ్జెట్ లభ్యం కానుంది.

- ఏర్పాటు చేసిన 25వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ 10 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

-3.5mm ఆడియో జాక్, బుల్ట్ స్పీకర్ మైక్రోఫోన్ వంటి అంశాలు వినియోగదారులకు మరింత లబ్థి చేకూరుస్తాయి.

ఉన్నత ప్రమాణాలతో డిజైన్ కాబడుతన్న ‘ఆపిల్ ఐప్యాడ్ మినీ’ కేవలం రూ.8,500కు లభ్యం కానుంది. ‘2012’ ప్రధమాంకంలో టాబ్లెట్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot