యాపిల్ ఐప్యాడ్ మినీ అమ్మకాలు ప్రారంభం

Posted By: Prashanth

యాపిల్ ఐప్యాడ్ మినీ అమ్మకాలు ప్రారంభం

 

దేశీయ మార్కెట్లో యాపిల్ ఐప్యాడ్ మినీ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. వై-ఫై వెర్షన్‌కి సంబంధించి 16 జీబీ మినీ ధర రూ.21,990గాను, 64 జీబీ రేటు రూ. 33,900గా ఉంటుంది. ఇక వై-ఫైతో పాటు 3జీ కూడా ఉండే వెర్షన్ రేటు రూ. 29,900-రూ. 41,900 దాకా ఉంటుంది. ఐప్యాడ్ మినీతో పాటు ఫోర్త్ జనరేషన్ ఐపాడ్, ఇంటర్నెట్‌ను టీవీ మీద వీక్షించే సెట్‌టాప్ బాక్స్- యాపిల్ టీవీలను కూడా యాపిల్ సంస్థ విక్రయాలకు అందుబాటులో ఉంచింది. దీని ధర రూ.6,990. ఇటీవలే యాపిల్ సంస్థ భారత్‌లో ఐ ట్యూన్స్ మ్యూజిక్ స్టోర్ సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఐప్యాడ్ మినీ స్పెసిఫికేషన్‌లు:

7.9 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, బ్లూటూత్, 16.3డబ్ల్యూహెచ్ఆర్ లిపో బ్యాటరీ (బ్యాకప్ – 10 గంటలు).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot